సుబ్రమణ్యం ఫర్ సేల్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ప్రొడ్యూసర్లను ఆకాశానికి ఎత్తేస్తూ చిరంజీవి చాలా మాట్లాడారు. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఈ స్థాయిలో ఉందంటే.. దానికి కారణం దిల్ రాజు పడ్డ కష్టమే కారణమన్నారు చిరు. రామానాయుడు, అశ్వనీదత్, అల్లు అరవింద్, జగపతి లాంటి సంస్థల తర్వాత.. ఒక బ్యానర్ కి ఇంత పేరు తెచ్చిన ఘనత దిల్ రాజుదే అన్నారు చిరంజీవి. ఈ కాలంలో నిజమైన ప్రొడ్యూసర్ అసలు అర్ధం రాజును చూస్తే అర్ధమవుతుందంటూ ఆకాశానికి ఎత్తేసిన చిరు... ఆ బ్యానర్ పై తనతో ఓ మూవీ తీయాలని కూడా అడిగారు.
చిరు చెప్పిన మాట వాస్తవమే. దిల్ రాజు మాదిరిగా అన్ని విషయాలను దగ్గరుండి చూసుకునే ప్రొడ్యూసర్స్ ఉండడం కష్టం. ఇప్పుడొస్తున్నవారిలో చాలామందికి ప్రొడ్యూసర్ చేసే పనులకు సంబంధించి ఏబీసీడీలు కూడా తెలీవు. స్టోరీ, స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే మధ్య తేడా ఏంటో తెలీని బాపతు అంతా.. నిర్మాతలైపోతున్నారు. ఏ రియల్ ఎస్టేట్ లోనో, ఇంకో వ్యాపారంలోనో సంపాందించిన సొమ్మంతా తెచ్చి మూవీస్ తీసేస్తున్నారు.
మళ్లీ ఇలాంటి సినిమాలకు స్టార్ హీరోయిన్స్ కావాలి. వాళ్ల ట్యాలెంట్ కి, మార్కెట్ కి రెట్టింపు రెమ్యూనరేషన్ ఇచ్చి బుక్ చేసుకుంటున్నారు. ఈ దెబ్బతో రియల్ ప్రొడ్యూసర్ల మూవీల్లో నటించేందుకు.. హీరోయిన్స్ కరువైపోతున్నారు. స్క్రిప్ట్ ను బట్టి వాళ్లే కావాలనుకుంటే... అడిగినంత ఇచ్చుకుని, నిర్మాణ ఖర్చులు పెంచేసుకోవాల్సి వస్తోంది. ఇలా బ్లాక్ మనీనో, అడ్డదారుల్లో సంపాదించిన డబ్బునో తెచ్చి సినిమాలు తీసే నిర్మాతలున్నంతవరకూ... ప్రొడక్షన్ కి వాల్యూస్ ఉండడం చాలా కష్టం. మెగాస్టార్ గారూ... ఇప్పుడు జరుగుతున్న తతంగం ఇదే. దీనిపై మీరేమంటారో ?