టాలీవుడ్ సినిమాల్లో కొన్ని రకాల ఎండింగ్స్ కు అసలు ప్లేస్ ఉండదు. ముఖ్యంగా విషాదాంతాలు.. చివర్లో హీరో చనిపోయే క్లైమాక్స్ లు కోటికొక్కటి అన్నట్లుగా తప్ప కనిపించవు. దర్శకులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. ఏం మాయచేశావేకు రెండు రకాల క్లైమాక్స్ లు తీశాడు దర్శకుడు గౌతమ్ మీనన్. ఇక మన స్టార్ హీరోలైతే.. అసలు యాంటీ క్లైమాక్స్ ను ఒప్పుకోరు.
చిరంజీవి ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్. ఆయన సినిమాల్లో హీరో చనిపోయే క్లైమాక్స్ లు దాదాపుగా కనిపించవు. మెగా బ్లాక్ బస్టర్ ఠాగూర్ లో కూడా హీరో చనిపోయే సీన్ ని మార్చేసి.. కోర్ట్ సీన్ పెట్టి అందరి సానుభూతి పొందేలా క్లైమాక్స్ ఛేంజ్ చేశారు. కానీ ఇప్పుడు చిరంజీవి 151వ సినిమాగా అనుకుంటున్న సబ్జెక్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఇది చారిత్రక కథాంశం కావడంతో.. ఇష్టం వచ్చినట్లు మార్చుకునే అవకాశం ఉండదు. చివర్లో ఆ స్వాతంత్ర్య సమరయోధుడిని బ్రిటిషర్లు ఉరి తీసినట్లుగా చూపించాల్సి వస్తుంది.
మరి ఆన్ స్క్రీన్ పై చనిపోయే సీన్స్ కు చాలా దూరం అన్నట్లుగా ఉండే చిరు.. ఇలాంటి సీన్ ని చేస్తారా లేక ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిషర్లు ఉరి తీశారు అని వాయిస్ చెప్పించి వదిలేస్తారా అనే చర్చ జరుగుతోంది. ఆన్ స్క్రీన్ పై తన పాత్ర చనిపోయేలా చిరంజీవి చేసిన చివరి చిత్రం స్నేహం కోసం. మరి ఉయ్యాలవాడలో చిరు ఏం చేస్తారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/