ఖైదీ నెం 150 వెనుక జయసుధ?

Update: 2017-01-28 05:02 GMT
ఖైదీ నెం 150 వెనుక సహజ నటి జయసుధ ఉన్నారు తెలుసా? అసలు ఖైదీ నెం 150 సినిమాను 'కత్తి' అంటూ తీసింది ఏ.ఆర్.మురుగుదాస్. ఇక సినిమాను తెలుగులో నేను చేద్దాం అనుకుంటున్నా అని చెప్పాగానే ఆ సినిమా రైట్స్ ను మెగాస్టార్ చిరంజీవికి ఇప్పించింది హీరో విజయ్. తెలుగులో కథను కాస్త మార్చింది వినాయక్.. పదునైన మాటలు రాసింది పరుచూరి బ్రదర్స్ అండ్ ఇతరులు.. కుమ్ముడు మ్యూజిక్ ఇచ్చింది దేవిశ్రీప్రసాద్. అసలు మొత్తం ఎపిసోడ్ లో సినిమాలో కనీసం యాక్ట్ కూడా చేయని జయసుధకు సంబంధం ఏంటి మాష్టారూ? ఆ విషయం తెలియాలంటే మాత్రం మనం ఒకసారి స్వయంగా మెగాస్టార్ చెప్పిన మాటలను వినాల్సిందే.

''ఒక విధంగా చెప్పాలంటే.. ఖైదీ నెం 150 సినిమా తో నేను తిరిగి సినిమాల్లోకి రావడానికి ఆవిడ కూడా ఒక ఇనిస్పిరేషన్. రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు కూడా చేయొచ్చు ఏముంది అంటూ ఆవిడ చాలాసార్లు చెప్పింది. మరి ఆవిడే రెండు పడవలపై స్వారీ చేస్తుండగా.. వై నాట్ మీ అనిపించింది. అందుకే సినిమా చేసేశాను'' అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు. ఈ మాటలను జయసుధను ఉబ్బితబ్బిబ్బు చేశాయనే చెప్పాలి. 'శతమానంభవతి' సక్సెస్ మీట్లో జయసుధ నటనాకౌశలాన్ని ఆకాశానికి ఎత్తేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఆమె ప్రేరణతోనే తను తిరిగి సినిమాల్లో నటిస్తున్నానంటూ అందరినీ ఖుషీ చేశారు. ఏదేమైనా కూడా.. ఖైదీ సక్సెస్ లో ఏ సంబంధం లేని జయసుధకు ఇలా భాగం ఇవ్వడం కాస్త ఆశ్చర్యకరమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News