రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్ వీడియో సోషల్ మీడియాలో సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. రామరాజుగా ఎన్టీఆర్ విజువల్స్ ఇంకా భీమ్ గా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వీడియో స్థాయి పెరిగింది. అద్బుతమైన విజువల్స్ తో పాటు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో భీమ్ ఫర్ రామరాజు వీడియో హైలైట్ గా నిలిచింది. ఈ వీడియో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వెయిటింగ్ అంటూ ట్వీట్ చేసిన చిరంజీవి వీడియో విడుదల తర్వాత స్పందించారు.
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో... అదిరింది రాజమౌళి మీ అంబులపొది లోంచి వదిలిన రామబాణం ఈ సీతారామరాజు. అమోఘం ఎన్టీఆర్. దుమ్ము లేపారు. మాలో ఉత్సాహాన్ని నింపారు. తారక్ నుండి చరణ్ కు మొమోరబుల్ బర్త్ డే సర్ ప్రైజ్ అంటూ చిరు ట్వీట్ చేశారు. చరణ్ వీడియోపై చిరంజీవి చాలా సంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా ఈ ట్వీట్ ను బట్టి అర్థం అవుతుంది.
టాలీవుడ్ జక్కన్న ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది. కరోనా కారణంగా షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. కనుక ఈ సినిమా షూటింగ్ కూడా బంద్ అయ్యింది. మే లేదా జూన్ లో సినిమా షూటింగ్ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది.