గోవిందంకి చిరు కితాబేంటో?

Update: 2018-08-16 04:45 GMT
ప్ర‌స్తుతం ఏ నోట విన్నా గోవిందం గురించే! మొత్తానికి అర్జున్ రెడ్డిగా న‌టించిన దేవ‌ర‌కొండ‌ గోవిందం పాత్ర‌లోనూ మెప్పించాడు. అస‌లు ప్యామిలీ సినిమాలే చేయ‌ను! అని భీష్మించుకున్న‌ దేవ‌ర‌కొండ‌ను బ‌ల‌వంతంగా ఒప్పించి హిట్ కొట్టాడు బ‌న్ని వాసు. గీత గోవిందం ఏ రేంజు హిట్టు అన్న‌ది సోమ‌వారం నాటికి తెలుస్తుంది. అయితే ఈలోగానే చిత్ర‌యూనిట్ బ్లాక్‌ బ‌స్ట‌ర్ అంటూ సంబరాల‌తో హోరెత్తించేస్తోంది. గంట గంట‌కు సెల‌బ్రిటీ షోల‌తో అల్లు అర‌వింద్ - ప‌ర‌శురామ్ - దేవ‌ర‌కొండ టీమ్ ఫిలింస‌ర్కిల్స్‌ ని హీటెక్కిస్తున్నారు.

లేటెస్టుగా మెగాస్టార్ చిరంజీవికి ప్ర‌త్యేకంగా ఓ షోని వేసింది చిత్ర‌యూనిట్. గీత గోవిందం షో వీక్షించిన అనంత‌రం మెగాస్టార్ స్వ‌యంగా చిత్ర‌బృందాన్ని అభినందించారు. ముఖ్యంగా హీరో దేవ‌ర‌కొండ‌కు  మెగాస్టార్ షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఓ రేంజులో పొగిడేస్తూ అభినందించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఇటువైపు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ - అటువైపు బాస్ అర‌వింద్ మోములో చిరున‌వ్వులు విజ‌యానికి సింబాలిక్‌ గా క‌నిపించాయి. మొత్తానికి గోవిందంగా ఆక‌ట్టుకున్న దేవ‌ర‌కొండ‌ - అంత హిట్టిచ్చిన ప‌ర‌శురామ్ మ‌ళ్లీ గీతా ఆర్ట్స్‌లో లాకైన‌ట్టేన‌న్న మాటా వినిపిస్తోంది.

`గీత గోవిందం` ఇంటా బ‌య‌టా బాక్సాఫీస్‌ ని ఊపేస్తోంద‌న్న స‌మాచారం ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాలు - అటు ఓవ‌ర్సీస్‌ లో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధిస్తోంది. కేవ‌లం అమెరికాలోనే ప్రీమియ‌ర్ల రూపంలో హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ (3కోట్లు) వ‌సూలు చేస్తోంద‌న్న రిపోర్ట్ అందింది. 400కె డాల‌ర్లు ఇంకా కౌంటింగ్ అంటూ వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వ‌సూళ్ల‌ను సాధిస్తోంద‌న్న రిపోర్ట్ అందుతోంది. ఈ సోమ‌వారం త‌ర్వాతా గోవిందం దూకుడు ఏ రేంజులో సాగ‌నుందో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News