ఆమె చీర పట్టుకున్నాను..సురేఖ పెళ్లికి ఒప్పుకోదనుకున్నా..వెక్కివెక్కి ఏడ్చాను: చిరంజీవి
‘చిరంజీవి..’ వెండి తెరను దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన నటుడు. ఆయన నటనకు అభిమానులు ఫిదా అయిపోయి ఇచ్చిన బిరుదు ‘మెగాస్టార్’. తెరపై నవరసాలను అలవోకగా పలికించగల ఈ హీరో.. నిజ జీవితంలో మాత్రం ఎంతో సౌమ్యంగా ఉంటారు. సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. ఆఫ్ ది స్క్రీన్ లో ఆయనను గమనిస్తే అర్థమయ్యే విషయం ఇది. మొన్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో తనదైన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్న చిరు.. లేటెస్ట్ గా ‘సామ్ జామ్’లోనూ అదేతరహాలో అలరించారు.
మెగాస్టారా మజాకా..
‘ఆహా’ ఓటీటీలో సమంత హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘సామ్ జామ్’. సెలబ్రిటీ టాక్ షోగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకూ పలువురు సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది సమంత. తాజాగా ఈ షోకి చిరంజీవి హాజరయ్యారు. ఈ షోలో.. మెగాస్టార్ తన కెరీర్ కి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన ఫ్యామిలీతోపాటు తన కెరియర్, సక్సెస్ గురించి కూడా చెప్పి ఆడియన్స్ తో ఆహా అనిపించారు.
అప్పుడేం జరిగిందంటే..
తాను ఒక సినిమా చూసి ఏడ్చానని చిరు చెప్పారు. ‘నటి మంజు భార్గవితో నేను కోతలరాయుడు అనే సినిమా చేస్తున్నాను. అప్పుడే ఆమె నటించిన శంకరాభరణం సినిమా విడుదలైంది. అయితే.. ప్రివ్యూ వేశారని సినిమా చూడటానికి ఆమె నన్ను రమ్మని పిలిచింది. అప్పుడు నేను ఆ సినిమా చూసి కన్నీళ్లు ఆగలేదు. ఎంతగానో ఏడ్చేశాను.
చీర కొంగు పట్టుకున్నా..
‘శంకరాభరణం చివరలో బాగా ఏడ్చాను. అయితే.. కన్నీళ్లు తుడుచుకోవటానికి కర్చిఫ్ కోసం వెతుకుతున్నాను. అప్పుడు నా పక్కనే ఉన్న మంజుభార్గవి నాకు తన చీర కొంగును ఇచ్చింది. అప్పటికి థియేటర్స్ లో లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. ఆమె పైట కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటుండగా.. లైట్స్ వెలిగాయి. అప్పటికీ ఆమె కొంగు నా చేతిలోనే ఉంది. ఆ దృశ్యాన్ని అందరూ చూశారు. ఏమనుకున్నారో ఏమో అనిపించింది.’ అంటూ నవ్వేశారు చిరు.
తను పెళ్లికి ఒప్పుకోదేమో అనుకున్నా..
‘ఈ సినిమా ప్రివ్యూకు అల్లు రామలింగయ్య ఫ్యామిలీ కూడా వచ్చింది. అప్పటి నాకు ఇంకా పెళ్లి కాలేదు. రామలింగయ్య గారితో వచ్చిన వాళ్లలో సురేఖ కూడా ఉందని అనుకుంటున్నాను. అయితే.. నా చేతిలో చీర కొంగును అందరూ చూశారు కాబట్టి.. పెళ్లి నిశ్చయమైనప్పుడు సురేఖ అసలు ఒప్పుకొని ఉండదు అనుకున్నాను. కానీ ఒప్పుకుంది.’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ముసిముసి నవ్వులు నవ్వారు.
ఆ ఫెయిల్యూర్ తో బాగా ఏడ్చాను..
తన కెరీర్ విషయంలో తాను బాగా ఏడ్చిన సందర్భాన్ని కూడా వివరించారు చిరంజీవి. ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చానని చెప్పారు. ‘ఖైదీ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత.. అదే సినిమా దర్శకుడు, నిర్మాత, నేను కలిసి ‘వేట’ సినిమా చేశాం. అయితే.. సేమ్ కాంబినేషన్ కావడంతో ‘వేట’ కూడా హిట్ అవుతుందని అనుకున్నాను. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ సమయంలో ఇంట్లో దుప్పటి కప్పుకొని ఎంతగానో ఏడ్చాను’ అని చెప్పారు చిరంజీవి. ఈ విధంగా తన కెరియర్, ఫ్యామిలీ ముచ్చట్లు పంచుకొని ‘సామ్ జామ్’ షోకు మరింత స్టార్ డమ్ తెచ్చారు మెగాస్టార్.