ఏడిపిస్తున్న చిరంజీవి చివరి మెసేజ్

Update: 2020-06-11 14:30 GMT
కన్నడ సినిమా నటుడు చిరంజీవి సర్జా ఆకస్మిక మరణం దక్షిణాది సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. దక్షిణాది ప్రముఖులంతా ఆయనకు నివాళులర్పించారు. మంచి భవిష్యత్ ఉన్న నటుడి మరణాన్ని ఇండస్ట్రీ తట్టుకోలేకపోయింది.

అయితే చిరంజీవి సర్జా చివరిసారి తన ప్రాణ మిత్రుడు ప్రజ్వల్ దేవరాజ్ తో వాట్సాప్ లో చేసిన చాట్ తాజాగా బయటకు వచ్చింది. మీడియాలో వైరల్ గా మారింది.

చిరంజీవి సర్జా చనిపోయే ముందు తన మిత్రుడితో ట్విట్టర్ ద్వారా మాట్లాడారు. ఈ సంభాషణలో ‘రేపు ఏం జరుగుతుందో తెలియదు.. ప్రెండ్స్ తో కలిసి వారం టూర్ ప్లాన్ చేద్దాం’ అని రాసుకొచ్చాడు. ఇదే అతడి చివరి మెసేజ్ కావడం విశేషం.

కన్నడ నటుడు చిరంజీవి సర్జా జూన్ 7వ తేదీన అకస్మాత్తుగా చాతిలో నొప్పితో కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా గుండెపోటుతో కన్నుమూశాడు. 2018లో మేఘనా రాజ్ ని చిరంజీవి సర్జా వివాహం చేసుకున్నాడు. ప్రముక హీరో అర్జున్ కు చిరంజీవి మేనల్లుడు కావడం గమనార్హం.
Tags:    

Similar News