మెగాస్టార్ డేట్ ఫిక్స్ చేశారు..!

Update: 2016-02-21 13:30 GMT
మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా..? చిరంజీవి చిన్న కూతురు పెళ్లికి సంబందించిన మూహుర్తం గురించే. కళ్యాణ్, శ్రీజ పెళ్లి మార్చి 8 న జరగనుందనే వార్తలు వచ్చాయి. కాని ఈ పెళ్లి మార్చి 28న జరగనుందని ఇటు చిరంజీవి ఫ్యామిలి, అటు కళ్యాణ్ తరపు వారు తెలిపారు.

ఈ పెళ్లి కోసం రామ్ చరణ్ కూడా తన సినిమా తని ఓరువన్ షూటింగ్ కూడా సెలవు పెట్టి పెళ్లి పనుల్లో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కళ్యాణ్ ను పెళ్లి చేసుకోవడం ద్వారా శ్రీజ మళ్లీ కొత్తగా తన జీవితం ప్రారంభించబోతోంది. ఇన్నాళ్లు తన కూతురు భవిష్యత్తుపై చిరంజీవి కాస్త బెంగగా ఉండేవారు. ఇపుడు ఆమె రెండో పెళ్లి ద్వారా కొత్త జీవితం ప్రారంభిస్తుండటంపై ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News