కోవిడ్ 19 భారిన పడి ఐసీయులో చికిత్స పొందుతున్నారు హీరో రాజశేఖర్. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు సహా ఆస్పత్రి వర్గాలు స్పందించిన సంగతి తెలిసిందే. ఆయన వైద్యానికి స్పందిస్తున్నారని కంగారు పడేది ఏదీ లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించగా.. తప్పుడు ప్రచరాన్ని నమ్మొద్దని జీవిత కోరారు.
ఇక శివాత్మిక బాధాతృప్త హృదయంతో నాన్నగారి ఆరోగ్యంపై రాసిన లేఖకు స్పందించిన మెగాస్టార్ చిరంజీవి .. తన సహచరుడైన రాజశేఖర్ త్వరగా కోలుకుంటారని ఆ కుటుంబంలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. అయితే బయటి ప్రపంచానికి తెలిసింది ఇంతవరకే. కానీ చిరంజీవి రాజశేఖర్ కోసం ఓ ప్రత్యేక ఏర్పాటు చేశారని తెలిసింది. మెగాస్టార్ స్వయంగా అపోలో ఆస్పత్రి వైద్యులను పిలిపించి రాజశేఖర్ కి అత్యుత్తమ చికిత్స అందించాల్సిందిగా కోరారట. అందుకోసం సీనియర్ వైద్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసారని తెలుస్తోంది. రాజశేఖర్ త్వరగా కోలుకునేలా చూడాలని ఆయన వైద్యులను కోరారట.
నిజానికి చిరంజీవి వర్సెస్ రాజశేఖర్ ఎపిసోడ్స్ గురించి అందరికీ తెలిసినదే. ఆ ఇరువురి మధ్య సఖ్యత అంతంత మాత్రమేనని పలు సందర్భలు నిరూపించాయి. అయితే రాజశేఖర్ ను కష్టంలో ఆదుకునేందుకు ముందుకొచ్చి చిరు గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుకోవడం ఫిలింనగర్ లో చర్చకు వచ్చింది. పలు సందర్భాల్లో చిరుని రాజశేఖర్ కుటుంబం విమర్శించినా అవేవీ పట్టించుకోకుండా సాటి మనిషిగా స్పందించి ఇలా మంచి వైద్యం అందించాలని అపోలో వర్గాల్ని కోరడం చర్చకు వచ్చింది. ఇక కెరీర్ ఆరంభంలో రాజశేఖర్ చిరు మధ్య స్నేహం ఉండేది. కానీ కాలక్రమంలోనే ఆ పరిస్థితి మారింది. వర్గపోరాటంగా మారాక మాత్రం ఆ ఇరువురి మధ్యా దూరం కనిపించింది. అయితే ఇటీవల చిరు మూవీ ఆర్టిస్టుల సంఘం తరపున జీవిత.. రాజశేఖర్ వర్గానికి బాసటగా నిలవడం చర్చకు వచ్చింది.