దొంగోడిని మార్చేస్తున్న మెగాస్టార్

Update: 2016-02-07 05:49 GMT
మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాగా కత్తి రీమేక్ ని ఎంచుకున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి. స్టోరీ రైట్స్ విషయంలో వివాదం తలెత్తడంతో షూటింగ్ వరకూ ఆపారు కానీ.. స్క్రిప్టింగ్ పనులు మాత్రం వేగంగానే సాగుతున్నాయి. ఈ గొడవ తేలిపోయాక షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు మెగాస్టార్.

అయితే కత్తి మూవీని చిరు ఇమేజ్ కి తగ్గట్లుగా మారుస్తున్నారు. ఇందులో భాగంగా ఓ కీలకమైన ఛేంజ్ ని చిరు సజెస్ట్ చేశారట. కత్తిలో హీరో డ్యుయల్ రోల్ చేయాలి. ఒక పాత్ర జైలు నుంచి విడుదలైన దొంగ అయితే.. మరో రోల్ సామాజికవేత్త. ఈ రెండు పాత్రల కేరక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ దొంగోడి రోల్ ని వేసేందుకు చిరు సిద్ధంగా లేరని టాక్. తన ఇమేజ్ ప్రకారం ఇప్పుడు దొంగ రోల్ చేయడం కరెక్ట్ కాదన్న చిరు ఫీలింగ్ గా తెలుస్తోంది.

అందుకే ఈ దొంగ పాత్రను.. ఓ గ్రామం నుంచి వ్యక్తిగా మార్చమని సూచించారట చిరు. ఇందుకు తగ్గట్లుగా మార్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే.. సినీ జనాలు మాత్రం ఇది కరెక్ట్ కాదేమో అని అభిప్రాయపడుతున్నారు. అసలు కత్తి సినిమా అంతా ఈ దొంగ కేరక్టర్ పైనే ఆధారపడిందని.. ఆ రోల్ మారిస్తే మూవీలో అంతగా కిక్ ఉండదంటున్నారు. మరి చిరంజీవి ఈ ఛేంజ్ ని ఎలా చేయిస్తున్నారో చూడాల్సిందే.
Tags:    

Similar News