మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ తేజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందింస్తున్న సైరా షూటింగ్ ఇప్పటి దాక హైదరాబాద్ లోనే జరుగుతూ వస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్స్ లో ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నవేశాలు చిత్రీకరించిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఓ వార్ ఎపిసోడ్ కోసం టీమ్ మొత్తాన్ని జార్జియా తీసుకెళ్ళబోతున్నాడు. గతంలో ఇక్కడ గౌతమి పుత్ర శాతకర్ణి కంచె షూటింగులు జరిగాయి. విశాలమైన మైదానాలతో పాటు అద్భుతమైన శిఖర సౌందర్యం జార్జియా సొంతం. అందుకే ఇలాంటి యుద్ధ నేపధ్యాలు ఉన్న సినిమాలు షూట్ చేయడానికి అక్కడ చాలా అనువుగా ఉంటుంది. విదేశీ ఆర్టిస్టులు దొరకడంతో పాటు అభిమానుల తాకిడి లాంటి సమస్యలు ఉండవు కాబట్టి ఇబ్బందులు కూడా తక్కువగా ఉంటాయి. ఈ షెడ్యూల్ 20 రోజుల దాకా ఉంటుందని సమాచారం. టీమ్ లో ఎవరెవరు వెళ్తారు అనే దాని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇప్పుడు జార్జియాలో తీయబోయే యుద్ధ సన్నివేశాలతో కీలకమైన వార్ ఎపిసోడ్స్ పూర్తవుతాయని తెలిసింది. ఇందులో అక్కడి స్థానికులతో కలిపి 500కు పైగా ఆర్టిస్టులు పాల్గొంటారట. రోమాలు నిక్కబొడుచుకుని స్థాయిలో వీటికి సూరి డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. ఇటీవలే విడుదలైన టీజర్ దెబ్బకు అంచనాలు పెరిగిపోగా విడుదల ఎప్పుడెప్పుడా అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తమన్నా-సుదీప్-జగపతి బాబు-అమితాబ్ బచ్చన్ తమ తమ పాత్రలకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొనగా తమిళ హీరో విజయ్ సేతుపతి ఎంట్రీ ఇంకా జరగాల్సి ఉంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న సైరా నరసింహారెడ్డి విడుదల మే లేదా జూన్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన క్లారిటీ రావాలంటే మాత్రం ఇంకొంత టైం పడుతుంది .