విమర్శలు, రేటింగ్ లు ఎలా ఉన్నా.. గుణశేఖర్ రుద్రమదేవి కలక్షన్ల పరంగా యాజ్ ఆఫ్ నౌ నిర్మాత ఫుల్ హ్యాపీ. ఈ మూవీకి మొదట స్టార్ స్టేటస్ అందించి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పడం. అప్పటివరకూ ఓ లెక్క... ఆ తర్వాత ఓ లెక్క అన్నట్లుగా క్రేజ్ పెరిగింది రుద్రమకి. సినిమాని నేరేట్ చేయడంలోనూ, మెగా ఫ్యాన్స్ మూవీని ఓన్ చేసుకోవడంలోనూ చిరు వాయిస్ చాలా కీలకం. బన్నీ క్యామియో కూడా ఉందనుకోండి.. అది వేరే సంగతి. అయితే.. మెగాస్టార్ ఇలా ఓ మూవీకి వాయిస్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు.
1980ల్లో చోటా చేతన్ అనే ఓ త్రీడీ సినిమా దేశాన్నే ఊపేసింది. మన దేశంలో ఇదే తొలి 3డీ చిత్రం. తెలుగులో చిన్నారి చేతన పేరుతో ఈ సినిమాను డబ్ చేశారు. ఈ మూవీ ప్రారంభంలో చిరంజీవి కనిపించి.. త్రీడీ గురించి చెబ్తారు. ఆ తర్వాత మధ్యమధ్యలో ఆయన వాయిస్ వినిపిస్తుంది. ఆ తర్వాత హనుమాన్ అనే యానిమేషన్ చిత్రం కోసం.. చిరంజీవి తన గాత్రదానం చేశారు. హనుమంతుడి కేరక్టర్ కి చిరు వాయిస్ ఈ హనుమాన్ కి స్పెషల్ అట్రాక్షన్. ఇప్పుడు దేశంలోనే తొలి హిస్టారికల్ 3డీ మూవీ అయిన రుద్రమదేవికి మళ్లీ చిరు వాయిస్ ఇచ్చారు. ఆయన వాయిస్ మూవీకి అడిషనల్ అసెట్. ఈ మూడు చిత్రాలు పిల్లలను ఆకట్టుకునేవే కావడం విశేషం.
చిన్నారి చేతన, రుద్రమదేవిలు చరిత్రలో నిలిచిపోయే ప్రతిష్టాత్మక 3డీ చిత్రాలు. హనుమాన్ టైంలో అయితే.. "కింగ్ ఆఫ్ సినిమా.. నేరేట్స్ హనుమ" అంటూ చేసిన ప్రచారమే... ఆ మూవీ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు రుద్రమ పరిస్థితీ ఇంతే. సినిమాకు మిక్సడ్ టాక్ వచ్చినప్పటికీ మెగాస్టార్ ఇచ్చిన వాయిస్ చాలామందిని ఎక్సయిట్ చేసింది. ప్రస్తుతానికి రుద్రమ సేఫ్ అవుతుందా లేదా అని చెప్పలేం కాని.. మెగాస్టార్ వాయిస్ అందిస్తే మాత్రం ఏదో విధంగా కలిసొస్తుందంతే. ఇలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు తన గొంతుతో సాయం చేస్తున్న చేసిన చిరు కూడా చరిత్రలో నిలిచిపోతున్నారు. అందుకే ఆయన మెగాస్టార్. కింగ్ ఆఫ్ టాలీవుడ్.