వెండితెరపై విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన అతి కొద్ది మంది టాలీవుడ్ హీరోల్లో ప్రధానంగా వినిపించే పేరు మెగాస్టార్ చిరంజీవి. 80వ దశకంలో మూస థోరణికి భిన్నంగా హీరో అంటే ఇలా వుండాలని హీరో పాత్రలకు రోల్ మోడల్ గా నిలిచి సరికొత్త శకానికి నాంది పలికారు. బ్రేక్ డ్యాన్స్, వెరైటీ ఫైట్స్ కి చిరు పెట్టింది పేరు. ఈ విషయంలో టాలీవుడ్ లో చిరు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. 'పునాది రాళ్లు' మూవీతో కెరీర్ ప్రారంభించిన చిరు సినీ ప్రయాణం మొదలు పెట్టి దాదాపు నాలుగు దశాబ్దాలు కావస్తోంది.
ఈ పాలుగు దశాబ్దాల్లో బూడు దశాబ్దాల పాటు నెంబర్ వన్ స్థానాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ అదే జోష్ తో యంగ్ హీరోలు, స్టార్ హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వున్న అగ్ర కథానాయకుల్లో చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'వాల్తేరు వీరయ్య'. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. బాబి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 13న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మీడియా ముందుకొచ్చారు. పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. మునుపెన్నడూ ఈ స్థాయిలో చిన్నా పెద్దా అని లేడా లేకుండా పలు మీడియా సంస్థలతో చిరు మాట్లాడుతూ 'వాల్తేరు వీరయ్య' కోసం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
బుధవారం మీడియా ముందుకొచ్చిన చిరంజీవి తన సినిమాలతో పాటు పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించడం విశేషం. కథలపై మంచి పట్టున్న చిరు కొన్ని సందర్భాల్లో కీలక మార్పులు చేయడంలో దిట్ట అనిపించుకున్నారు కూడా.
అయితే భవిష్యత్తులో దర్శకత్వం వహించే అవకాశాం వుందా? అని మీడియా ప్రశ్నిస్తే.. నమ్మకం కుదిరితే ఆ పని చేసేస్తా నంటున్నారు. జీవితాంతం సినిమాలతో మమేకం అవ్వాలనుకుంటున్నాను. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తానన్న నమ్మకం నాకు వచ్చి, ఆ అవకాశం కూడా కుదిరినప్పుడు ఖచ్చితంగా చేస్తానేమో అన్నారు. ఇక 'వాల్తేరు వీరయ్య' సినిమాపై స్పందిస్తూ.. నా అభిమానులకు ఏం కావాలో అవన్నీ పుష్కలంగా వున్న సినిమా ఇదన్నారు.
పిల్లలు కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని, సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' పర్ ఫెక్ట్ మూవీ అని చెప్పుకొచ్చారు. చిరు ఇంత నమ్మకంగా చెబుతుండటంతో అభిమానులు కూడా ఈ మూవీపైనే ఆశలు పెట్టుకుంటున్నారట. 'ఆచార్య' డిజాస్టర్ కావడం.. 'గాడ్ ఫాదర్' ఫరవాలేదనిపించుకోవడంతో 'వాల్తేరు.. తో ఈ సారి గట్టిగా కొట్టాలని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.