టాలీవుడ్ లో మెగాస్టార్ కు తిరుగులేదన్న సత్యం మరో సారి నిరూపితమైంది. అయితే.. ఇది వెండితెర సాక్షి గా కాదు.. బుల్లితెరతో. తాజాగా వెల్లడైన లెక్కలు చూసినప్పుడు చిరు ఛరిష్మా రేంజ్ ఇంతా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో దుమ్ము లేపిన బిగ్ బాస్ రియాల్టీ షో.. తెలుగు లోనూ ఇరగదీస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సీజన్ మూడును విజయ వంతంగా ముగించారు.
దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన బిగ్ బాస్ 3 ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ సందర్భం గా పాత రికార్డులు బ్రేక్ అయి.. కొత్తవి వచ్చేశాయి. తొలి రెండు సీజన్స్ తో పోలిస్తే.. మూడో సీజన్ కాస్త వెనకబడినట్లుగా వార్తలు వచ్చాయి. మొదట్లో సీజన్ 3 కి ప్రేక్షక ఆదరణ బాగానే ఉన్నట్లు కనిపించినా.. మధ్యలో కాస్త మందగించిందన్న మాట వినిపించింది.
అయితే.. ఈ కొరత ను తీరుస్తూ ఫైనల్ రోజున దుమ్ము రేపిన వైనం తాజాగా బయట కు వచ్చింది. కింగ్ నాగ్ ప్రయోక్త గా సాగిన గ్రాండ్ ఫైనల్ లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధి గా ఫైనల్ సాగింది. తాజాగా వెల్లడైన టీఆర్పీ రేటింగ్ ప్రకారం తెలుగు చరిత్ర లో అత్యధిక రేటింగ్స్ తీసుకొచ్చిన గ్రాండ్ ఫినాలేగా మిగిలిపోయింది.
సీజన్ 3 ఫైనల్ ప్రసారమైన నవంబరు 3న బిగ్ బాస్ ఎపిసోడ్ కు 18.29 రేటింగ్ వచ్చింది. బిగ్ బాస్ 1, 2 ఫైనల్స్ కు వచ్చిన టీఆర్పీ రేటింగ్ తో పోలిస్తే.. సీజన్ 3 దుమ్ము రేపిందని చెప్పాలి. ఆసక్తి కరమైన మరో విషయం ఏమంటే.. ఫైనల్ లో చివరి గంటకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ సమయంలో టీఆర్పీ రేటింగ్ ఏకంగా 22.4 రేటింగ్ తీసుకొచ్చింది. ఇది మామూలు రికార్డు కాదన్న విషయాన్ని చెబుతున్నారు. చిరు ఎంట్రీ ఇచ్చిన చివరి గంటకు వచ్చిన రేటింగ్ చూసినోళ్లు మెగాస్టార్ ఛరిష్మా ఎంతన్నది బుల్లితెర సాక్షిగా మరోసారి ఫ్రూవ్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది.