చిరు ‘కింగ్ మేకర్’ ?

Update: 2021-04-11 04:12 GMT
కింగ్ అవ్వటం వేరు... ‘కింగ్ మేకర్’ అవ్వటం వేరు. ఈ రెంటిలో ఎవరు గొప్పా అంటే  ‘కింగ్ మేకర్’ అని చెప్తారు. చాలా మంది తమను తాము  ‘కింగ్ మేకర్’ గా రింగ్ మాస్టర్ గా ఫీలవుతూంటారు. అయితే నిజమైన  ‘కింగ్ మేకర్’ లు అరదుగా ఉంటారు. అసలైన  ‘కింగ్ మేకర్’ ఎలా ఉంటారో చిరంజీవి చెప్పబోతున్నారట. అదీ రాజకీయాల్లో చిరు  ‘కింగ్ మేకర్’ అనిపించుకోబోతున్నారు. అయితే నిజ జీవితంలో కాదు ..తెరపైన .  ‘కింగ్ మేకర్’ టైటిల్ తో ఆయన ఓ సినిమా చెయ్యబోతున్నారు. ఎవరా డైరక్టర్, ఏమా కధ అంటే...

చిరంజీవి వరస పెట్టి చేస్తున్న సినిమాల్లో “లూసిఫర్” రీమేక్ ఒకటి. ఈ సినిమా కు మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాకు రకరకాల టైటిల్స్ అనుకుంటున్నారు.  వాటిలో రెండు టైటిల్స్ చిరంజీవికి నచ్చాయట.  ‘కింగ్ మేకర్’ అందులో ఒకటి. రెండో టైటిల్ ‘అన్న’ అంటున్నారు.పంచెకట్టులో ఫుల్ లెంగ్త్ రోల్ లో ఈ సినిమా చిరంజీవి కనపడబోతున్నారు. రాజకీయ చదరంగంలో విజేతగా నిలిచే ఓ యోధుడు కథ ఇది. ఎత్తుకు పై ఎత్తులతో కథ,కథనం నడుస్తుంది.

ఈ సినిమా కాన్సెప్టుకు తగ్గట్లు చూస్తే  ‘కింగ్ మేకర్’ ది బెస్ట్ టైటిల్ అనిపిస్తుంది. అలాగే టైటిల్ కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. టైటిల్ పెట్టారంటే ఫ్యాన్స్ కూడా ఎగ్జైట్ ఫీల్ అవ్వాలి. అందులో మెగా ఫ్యాన్స్ అంటే వాళ్లకు కొన్ని లెక్కలు ఉంటాయి. చిరంజీవి ఎలా చూడాలనుకుంటున్నారనే దానిపై క్లారిటీ ఉంటుంది. ఈ విషయాలన్ని చిరుకు బాగా తెలుసు. అందుకే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సక్సెస్ ఫుల్ స్టార్ గా యంగ్ హీరోలకు పోటీ ఇవ్వగలుగుతున్నారు.

ఇక ఈ రీమేక్ విషయానికి వస్తే....తమిళ దర్శకుడు మోహన్ రాజా ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసారు. మన  తెలుగు ప్రేక్షకులు,ముఖ్యంగా మెగాభిమానుల అభిరుచికి తగ్గట్టు ఈ సినిమా కథలో కీలక మార్పులు చేర్పులు చేశారని సమాచారం.  సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ – సూపర్ గుడ్ ఫిలిమ్స్ – ఎన్‌విఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్‌ పై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Tags:    

Similar News