చిరు సార్‌.. 'ఆ ఒక్క మాట' అన‌కుండా ఉండి ఉంటే.. టాలీవుడ్‌లో చ‌ర్చ‌!

Update: 2022-02-11 05:30 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్‌తో టాలీవుడ్ ప్ర‌ముఖులు... మెగాస్టార్ చిరంజీవి,, ప్ర‌భాస్‌, మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి, ఆలీ, నారాయ‌ణ‌మూర్తి త‌దిత‌రులు చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇండ‌స్ట్రీ విష‌యంలో తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య ల‌ను సీఎం ముందు ఏక‌రువు పెట్టారు. దాదాపు 40 న‌నిమిషాలు జ‌రిగిన ఈ చ‌ర్చ‌ల అనంతరం.. బ‌యట‌కు వ‌చ్చిన చిరు.. బృందం.. మీడియాతో హుందాగా మాట్లాడారు. సీఎం జ‌గ‌న్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఆయన బాగానే ఉన్నార‌ని.. సినీరంగంపై ఆయ‌న‌కు విజ‌న్ ఉంద‌ని అన్నారు.

ఇలా ప్ర‌తి ఒక్క‌రూ సీఎంను కొనియాడారు. అయితే.. ఈ స‌మావేశం తాలూకు.. వీడియో రికార్డ్‌.. కొన్ని గంట‌ల త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనిలో ఎవ‌రెవ‌రు ఏం మాట్లాడారు?  సీఎం ఏం చెప్పారు. అనే వివ‌రాలు. వాస్త వానికి ఈ కార్య‌క్ర‌మం మొత్తాన్ని రికార్డు చేసింది ప్ర‌భుత్వానికి చెందిన ఐఅండ్ పీఆర్ శాఖే. దీనిలో తొలుత మీడియాకు విడుద‌ల చేసింది సీఎం జ‌గ‌న్ వాయిస్‌. వాస్త‌వానికి ఆయ‌న స‌మావేశంలో చివ‌ర మాట్లాడారు.. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న వాయిస్‌ను ముందుగా మీడియాకు ఇచ్చారు.

త‌ర్వాత‌... ఎవ‌రెవ‌రు మాట్లాడారు? అనే విష‌యాల‌ను మీడియాకు విడుద‌ల చేశారు.. దీనిలో ప్ర‌ధానంగా చిరంజీవి చేసిన కామెంట్లు ఇప్పుడు వివాదానికి దారితీస్తున్నాయి. ``త‌ల్లిలాంటివారు మీరు పెద్ద‌మ‌న‌సు చేసుకుని ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌ను నెర‌వేర్చాలి`` అని చిరు అనాల్సి ఉందేమో... కానీ, ఆయ‌న ఈ వాక్యానికి చివ‌ర‌న ``చేతులు జోడించి అడుగుతున్నాం!`` అనేశారు. ఇదేఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. చిరు ఇంత‌గా ఎందుకు `దిగ‌జారారు?` అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ ప్ర‌భుత్వం ఉండిపోయేది ఐదేళ్లు. మ‌ళ్లీ వ‌స్తుందా?  రాదా? అనేది ప‌క్క‌న పెడితే.. హ‌క్కుగా ఉన్న అంశాల‌ను ప‌ట్టుబ‌ట్టి సాధించుకోవాల్సిన ఇండ‌స్ట్రీ.. ఇలా చేతులు జోడించ‌డం ఎందుకు? అనేది నెటిజ‌న్ల ప్ర‌శ్న‌. ఇండ‌స్ట్రీ శాశ్వ‌తం.

అంద‌రూ క‌ష్ట‌ప‌డి సినిమాలు చేస్తున్నారు. ఇందులో అవినీతి లేదు. హ‌క్కులు ఉన్నాయి! వాటిన‌ని సాధించుకునేందుకు చ‌ర్చ‌లు ఒక మార్గం త‌ప్ప‌.. సాగిల‌ప‌డ‌డం మార్గం కాదు క‌దా!  చిరంజీవి ఇలా మాట్లాడి ఎలాంటి సంకేతాలు పంపుతున్నారు. రేపు ఇంత‌క‌న్నా పెద్ద స‌మ‌స్య వ‌స్తే..పొర్లు దండాలు పెడ‌తారా?  పోరాడి సాధించుకుంటారా? అనేది నెటిజ‌న్ల ప్ర‌శ్న‌. మ‌రి టాలీవుడ్‌లో ఏమంటారో చూడాలి.
Tags:    

Similar News