మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఆచార్య.. విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప ఒక రోజు తేడాతో రిలీజ్ కి సిద్ధమవుతుండడం సర్వత్రా మెగా దగ్గుబాటి అభిమానుల్లో చర్చకు తావిస్తోంది.ఆచార్య టీజర్ మ్యాటర్ తో పాటే కొద్దిసేపటికే రామ్ చరణ్ విడుదల తేదీని ప్రకటించి షాకిచ్చారు. నేడు ఏమంత పెద్దదిగా ఏదీ లేదు! మే 13 నుంచి థియేటర్లలో ఆచార్య`` అని పోస్టర్ తో రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
అయితే ఆచార్య తేదీ వెంకీ నారప్ప రిలీజ్ డేట్ తో క్లాష్ అవుతుండడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆచార్య టీజర్ లాంచ్ కి సరిగ్గా కొన్ని గంటల ముందు సురేష్ ప్రొడక్షన్స్ మే 14 న నారప్ప విడుదలవుతుందని ప్రకటించింది. ఆ వెంటనే ఆచార్య రిలీజ్ తేదీని ఒకరోజు తేడాతో ప్రకటించడంతో బాక్సాఫీస్ క్లాష్ కి ఆస్కారం ఇచ్చినట్టయ్యింది.
అయితే క్లాష్ రాకుండా పరిష్కారం లేదా? మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్ అనకుండా మాట్లాడుకునే వీలుందా? అన్నది చూడాలి. ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు రోజు తేడాతో విడుదలైనా ఓపెనింగ్ వసూళ్ల పరంగా షేరింగ్ తప్పదు. మరికాస్త గ్యాప్ ఉంటే ఆ ఇబ్బంది నుంచి బయటపడ్డట్టే. మరోవైపు 'వకీల్ సాబ్' తో పాటు మరో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ బరిలోకి రావడంతో వేసవి సీజన్ రాకముందే హీట్ పెరిగింది.