వాతావరణం ప్రతికూలంగా మారినప్పుడు తుఫాన్లు ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ఒకటో నంబర్ హెచ్చరిక అనేది వింటుంటాం. ఐదో నంబర్ .. ఏడో నంబర్ అంటూ ప్రమాద తీవ్రతను బట్టి హెచ్చరికల్ని వాతావరణ శాఖ జారీ చేస్తుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి హెచ్చరికల్ని జారీ చేసి మెగాస్టార్ చిరంజీవి చరణ్ గుండెల్లో గుబులు పుట్టించారని తెలుస్తోంది.
రామ్ చరణ్ ఇప్పుడు RRR పూర్తి చేసి తదుపరి శంకర్ దర్శకత్వంలో RC15 ని ఇటీవల ప్రారంభించారు. ఇది త్వరలో సెట్స్ పైకి వెళుతోంది. రెగ్యులర్ చిత్రీకరణకు చరణ్ అటెండ్ కావాల్సి ఉంది. అయితే చిరంజీవి ఆచార్య గురించి రామ్ చరణ్ కు కఠినమైన సూచనలు పంపారట.
కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా చిత్రీకరణ చాలా కాలంగా జరుగుతోంది. కోవిడ్ వల్ల అంతకంతకు ఆలస్యమవుతోంది. ప్రాజెక్ట్ ను మరింత ఆలస్యం చేయడం సరికాదు. అందుకే ఆర్.సి 15 రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లే ముందు ఆచార్య షూటింగ్ పూర్తి చేయాలని చరణ్ ని కోరారట. చరణ్ చిరు సూచనలకు కట్టుబడి ఉన్నాడు. అతను ఈ నెలాఖరులో ఆచార్య షూట్ ను పూర్తి చేయబోతున్నాడు. మేకర్స్ త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. సంక్రాంతి 2022కి ఆచార్య విడుడలవుతుందని ఇంతకుముందు కథనాలొచ్చాయి.
ఇకపోతే ఇద్దరు పాన్ ఇండియా దర్శకులతో రామ్ చరణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. రాజమౌళితో ఆర్.ఆర్.ఆర్ పూర్తయిన వెంటనే ఆర్.సి 15 ని పాన్ ఇండియా కేటగిరీలో ప్రారంభించారు. లెజెండరీ దర్శకుడు శంకర్ తో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని చిరు తనయుడు చరణ్ కి సూచించారని కూడా తెలుస్తోంది. అయితే ప్రతిదీ పర్ఫెక్షన్ కోరుకునే రామ్ చరణ్ ఆ విషయంలో ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండరన్నది తెలిసిందే.