ఉయ్యాలవాడలో మెగాస్టార్ టీం

Update: 2017-06-25 05:01 GMT
మెగా151గా తెరకెక్కుతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం విషయంలో.. మూవీ యూనిట్ ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఆగస్టులో ఉయ్యాలవాడ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి.. షూటింగ్ స్టార్ట్ చేయనుండగా.. ఈలోగా ఉన్న సమయాన్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డిపై పరిశోధనలకు వినియోగిస్తున్నారు.

తాజాగా ఈ స్వాతంత్ర్య సమరయోధుడి స్వగ్రామం అయిన కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడలో అడుగు పెట్టింది మెగాస్టార్ కు చెందిన ఒక టీం. ఆయన ఇంటిని.. అక్కడి పరిసరాలను.. గుర్తులను అన్నిటినీ సేకరించారు. అంతే కాదు.. కొందరు వయో వృద్ధులను పలకరించి.. వారికి తెలిసిన విషయాలను నోట్ చేసుకున్నారు. అలాగే.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని పూర్తి స్థాయిలో తిరిగి సృష్టించేందుకు వీలుగా.. మొత్తం ఇంటిని వీడియోలలో బంధించారు. అలాగే ఒక గ్రాఫిక్స్ టీం ను కూడా ఇదే పని మీద ఉంచారు చిరంజీవి. ఆ ఇంటిలోని అతి చిన్న విషయాలను కూడా రీక్రియేట్ చేయాలని చెప్పారట.

ఈ మూవీ గ్రాఫిక్స్ విషయంలో కూడా మెగా టీం ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. బాహుబలి తర్వాత.. ఆ స్థాయికి తగ్గకుండా ఉయ్యాలవాడలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. 100 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టాలని మొదలుపెట్టిన ఈ మూవీ బడ్జెట్.. ఇప్పుడు 200 కోట్లకు చేరుకుందని అంటున్నారు. కార్డ్స్ పైనే ఇంత ఉంటే.. షూటింగ్ సమయానికి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయట. ఇందుకు ప్రొడ్యూసర్ రామ్ చరణ్ మాత్రం.. గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట దర్శకుడు సురేందర్ రెడ్డి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News