# PS 1 చోళ రాజు సింహ‌గ‌ర్జ‌న ఐదు భాష‌ల్లో

Update: 2022-07-14 04:30 GMT
మణిరత్నం తెర‌కెక్కిస్తున్న `పొన్నియిన్ సెల్వన్` ఐదు భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కరోనా క్రైసిస్ వ‌ల్ల చాలా ఆల‌స్యంగా షూట్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు స్పీడ్ గా సాగుతున్నాయి.  తాజాగా విడుదైన టీజర్ లో విక్రమ్ డబ్బింగ్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.

ఈ ప్రాజెక్ట్ లో విక్రమ్- ఐశ్వర్య రాయ్ బచ్చన్ - జయం రవి- కార్తీ- త్రిష- ఐశ్వర్య లక్ష్మి- శోభితా ధూళిపాళ- ప్రభు- ఆర్. శరత్ కుమార్- విక్రమ్ ప్రభు- జయరామ్ప్ర- ప్ర‌కాష్ రాజ్- రెహమాన్- ఆర్.

పార్తిబన్ వంటి తార‌లు న‌టిస్తున్నారు. విక్రమ్ ఆదిత్య కరికాలన్ టైటిల్ రోల్ లో కనిపించనుండగా.. నందినిగా ఐశ్వర్యరాయ్ బచ్చన్ నటించింది. వంతీయతేవన్ పాత్రలో కార్తీ- కుందవై పాత్రలో త్రిష- అరుణ్ మొళి వర్మన్ గా జయం రవి కనిపించనున్నారు.

10వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో ఆధిపత్య పోరును తెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్న‌మిది. 1950ల నాటి `కల్కి` అనే ఎవర్ గ్రీన్ తమిళ నవలకి సినిమాటిక్ అనుసరణ. ఇది కావేరీ నది కుమారుడైన పొన్నియిన్ సెల్వన్ భారతదేశ చరిత్రలో గొప్ప చక్రవర్తులలో ఒకరిగా మారడానికి ముందు క‌థ‌.. రాజరాజ చోళుడుగా  పొన్నియ‌న్ గొప్ప‌ పిలుపును అందుకున్నారు. గొప్ప చ‌క్ర‌వ‌ర్తిగానూ పేరు తెచ్చుకున్నారు.

శ్రీ సుభాస్కరన్ లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ -లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ చిత్రం తమిళం- హిందీ- తెలుగు- కన్నడ- మలయాళం సహా పలు భాషల్లో విడుదల కానుంది. కెమెరా: రవి వర్మన్‌- ఎడిటింగ్‌: ఎ. శ్రీకర్‌ ప్రసాద్‌. పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాల ఫ్రాంచైజీ గా సంచ‌ల‌నాల కోసం సిద్ధ‌మ‌వుతోంది. దీనిని పీఎస్ 1  - పీఎస్ 2 గా చెబుతున్నారు.


Full View
Tags:    

Similar News