తమిళ స్టార్ హీరో విక్రమ్ మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకప్పుడు వరుసగా సూపర్ హిట్స్ ను దక్కించుకున్న విక్రమ్ ఇప్పుడు మాత్రం వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ లను ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు విక్రమ్ సినిమాలకు తెలుగు లో మంచి మార్కెట్ ఉండేది. అపరిచితుడు మరియు అంతకు ముందు సినిమాలు కూడా తెలుగు లో మంచి వసూళ్లను నమోదు చేశాయి.
ఇప్పుడు తెలుగు లో విక్రమ్ సినిమాలు అత్యంత దారుణమైన వసూళ్లు నమోదు చేస్తున్నాయి. తెలుగు లో విక్రమ్ సినిమా లకు మార్కెట్ అస్సలు లేదనే చెప్పాలి.. అయినా కూడా తాజాగా విక్రమ్ నటించిన కోబ్రా సినిమా ను ఇక్కడ భారీ ఎత్తున విడుదల చేసేందుకు కష్టపడ్డారు. అనుకున్నట్లుగానే కోబ్రా ని తెలుగు లో భారీగానే విడుదల చేశారు. కానీ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కనీసం కోటి రూపాయల షేర్ ను కూడా దక్కించుకోలేక పోయింది అంటూ బాక్సాఫీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులో ఎంత మేరకు నిజం ఉంది అనే విషయం పై క్లారిటీ లేదు. కానీ కోబ్రా సినిమా తెలుగు వెర్షన్ డిజాస్టర్ అని మాత్రం చాలా మంది బలంగా చెబుతున్నారు.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాట కూడా ఈ సినిమా డిజాస్టర్ టాక్ ని దక్కించుకుంది. మొదటి రోజు గౌరవ ప్రదమైన వసూళ్లను అక్కడ సాధించిన కూడా రెండో రోజు అత్యంత దారుణంగా వసూళ్లు పడిపోయాయి. అక్కడ వంద కోట్ల వసూళ్ల టార్గెట్ తో విడుదల అయిన కోబ్రా కనీసం ఇరవై కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.
అపరిచితుడు రేంజ్ లో కోబ్రా ఉంటుందని విక్రమ్ అక్కడ ఇక్కడ ప్రచారం చేశాడు. సినిమా పై ఇక్కడ పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు.. కానీ తమిళ నాట మాత్రం భారీ అంచనాలు నమోదు అయ్యాయి. సినిమా పై అంచనాలు భారీగా వచ్చాయి. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం బొక్క బోర్లా పడి విక్రమ్ ఖాతాలో మరో డిజాస్టర్ గా నిలిచింది.