తనలో కొరియోగ్రాఫర్ మాత్రమేకాదు.. అమ్మాయిలను వేధించే వేస్ట ఫెలో కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడో వ్యక్తి. మరి, పోలీసులు ఊరికే ఉంటారా? తాము.. వెధవలపాలిట యమకింకరులమని గుర్తు చేశారు. స్మూత్ గా తెలియజెప్పారు. ఇదంతా హైదరాబాద్ లో జరిగింది.
నగరానికి చెందిన ఓ వ్యక్తి షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి ఓ యువతి పరిచయం అయ్యింది. గతేడాది తాను నిర్మించిన ఓ షార్ట్ ఫిలింలో ఆమె నటించింది. అయితే.. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో.. వీరిమధ్య గ్యాప్ ఏర్పడింది. ఇది సహించలేని ఆ వ్యక్తి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించాడు. పక్కదారిపట్టాడు.
సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి ఆ యువతికి సంబంధించిన అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలు పోస్ట్ చేయడం మొదలు పెట్టాడు. ఈ విషయం సదరు యువతికి తెలిసి షాకైంది. అవన్నీ తాను షార్ట్ ఫిలిమ్ లో నటిస్తున్న సమయంలో ప్రైవేటుగా ఉన్నవి. అంటే.. ఇతగాడు ఆ అమ్మాయికి తెలియకుండా షూట్ చేశాడట.
ఎవరు ఈ పని చేస్తున్నారో అర్థంగాక.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని గుర్తించారు. అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యువతులు ఇలాంటి వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫేమస్ చేస్తామని ఎవరో చెప్పగానే నమ్మి వెళ్లొద్దని, అన్ని విషయాలూ తెలుసుకున్న తర్వాతే ముందడుగు వేయాలని సూచిస్తున్నారు.