చిరు బయోపిక్ తీయమని హింట్ ఇస్తున్నాడా...?

Update: 2020-06-14 06:21 GMT
జూన్ 14 - 'వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే' సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా 'రక్తాన్ని ఇవ్వండి ప్రాణాలను కాపాడండి' అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి ''ఒకరి ప్రాణాన్ని కాపాడటం కంటే మనకి సంతృప్తినిచ్చేది ఏమి ఉంటుంది. బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయబడిందని.. ప్రజలు రక్తదానం చేస్తున్నారని నేను విన్న ప్రతిసారి - మానవాళికి సూపర్ పవర్ ఇచ్చినందుకు నేను దేవుడికి థ్యాంక్స్ చెప్తుంటాను. రక్త దానం చేయండి!  ప్రాణదాతలు కండి!'' అంటూ ట్వీట్ చేసారు. దీనికి చిరంజీవి బ్లడ్ డొనేషన్ చేస్తున్న క్లిప్పింగ్స్ తో ఒక స్ఫూర్తి దాయకమైన వీడియోని పోస్ట్ చేసారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి గత కొన్నేళ్లుగా ఎంతో మందికి రక్తదానం చేస్తున్న సంగతి తెలిసిందే. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ తన అభిమానులను కూడా ఈ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసి ఇతరుల ప్రాణాలను కాపాడమని పిలుపునిస్తూ వస్తుంటాడు.

ఇదిలా ఉండగా ఈ ట్వీట్ చేయడానికి ముందు చిరంజీవి ''ఈ రోజు ఉదయం 10 గంటలకి నా జీవితంలో అత్యంత సంతృప్తికరమైన క్షణాలను పంచుకుంటాను'' అని పేర్కొన్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీయమని హింట్ ఇస్తున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఆయన సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అగుపెట్టి స్వయంకృషితో ఈ స్థాయికి ఎదిగిన చిరంజీవి జీవితం అందరికి ఆదర్శమని.. ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన చిరంజీవి సినీ కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్థాయికి వచ్చాడని.. శివశంకర్ వర ప్రసాద్ నుండి 'మెగాస్టార్' చిరంజీవిగా మారడానికి ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లు నేటితరం నటీనటులు ఆదర్శంగా తీసుకొంటుంటారు. నేటి స్టార్ డైరెక్టర్స్ - స్టార్ హీరోల్లో చాలా మంది మెగాస్టార్ ని ఇన్ స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చామని చెప్తూ ఉంటారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి జీవితాన్ని ఆధారంగా చేసుకొని బయోపిక్ తీస్తే బాగుంటుందని మెగా అభిమానులు కూడా అభిప్రాయ పడుతున్నారు.

ఇటీవల సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. సినీ రాజకీయ క్రీడా సామాజిక రంగాలలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల ఆటోబయోగ్రఫీలు బియోపిక్స్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు ఆటోబయోగ్రఫీ కూడా సినిమాగా వస్తుందేమో అని డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ తనదైన శైలిలో పోస్ట్స్ పెడుతూ లేట్ గా ఎంట్రీ ఇచ్చినా అక్కడ కూడా డామినేషన్ చూపిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని షేర్ చేసుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్య ఇంటికే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి ఈ స‌మ‌యాన్ని 'ఆత్మ‌క‌థ' రాసుకోవ‌డానికి ఉప‌యోగించుకుంటున్నానని వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో మెగాస్టార్ బయోపిక్ కూడా వచ్చే ఛాన్స్ ఉందంటూ మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో 'మెగాస్టార్ బయోపిక్' దిశగా అడుగులు పడతాయేమో చూడాలి.
Tags:    

Similar News