అనన్య.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్

Update: 2017-07-04 17:30 GMT
బాలీవుడ్ దర్శక దిగ్గజం కరణ్ జోహార్ తీయబోయే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2లో హీరోయిన్ ఫైనల్ అయిపోయింది. ఈ సినిమా ద్వారా స్టార్ కిడ్ ఎవరో ఒకరిని ఇంట్రడ్యూస్ చేయాలని కరణ్ జోహార్ ఎప్పుడో ఫిక్సయిపోయాడు. అది ఎవరా అని బాలీవుడ్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కొద్ది సంవత్సరాల క్రితం వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా ద్వారా ఆలియా భట్ వెండితెరకు పరిచయమైంది. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది. దీంతో సెకండ్ పార్ట్ హీరోయిన్ పై సహజంగానే ఆసక్తి పెరిగింది.

ఎట్టకేలకు ఈ అవకాశాన్ని అనన్య పాండే దక్కించుకుంది. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె అయిన ఈ పద్ధెనిమిదేళ్ల భామ ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ సరసన నటించనుంది. అనన్యకు ముందు పలువురి పేర్లు వినిపించాయి. ఫస్ట్ దిశా పఠాని చేస్తుందని ప్రచారం జరిగింది.  తర్వాత సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా ఆలీఖాన్ పేరు తెరపైకొచ్చింది. అతడి మొదటి భార్య, సారా తల్లి అమృతాసింగ్ ఇందుకు ఇష్టపడలేదన్నది బాలీవుడ్ టాక్. తర్వాత శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతుందని అనుకున్నా చివరకు అవకాశం అనన్యను వరించింది.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2 సినిమా కోసం అనన్య అప్పుడే రెడీ అయిపోతోంది. సెలబ్రిటీ ఫిట్ నెస్ కోచ్ యాస్మిన్ కరాచీవాలా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటోంది.  యాక్టింగ్ అండ్ డ్యాన్సింగ్ క్లాసులకు అటెండ్ అవుతోంది. ప్రొఫెషనల్ న్యూట్రిషనలిస్ట్ సూచనలతో బాడీని ఫిట్ అండ్ స్లిమ్ గా ఉండేలా చూసుకుంటోంది.  ‘నా కుమార్తెగా కాకుండా అనన్య తన సొంత గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా’ అని ఆమె తండ్రి చుంకీ పాండే అనన్య తెరంగేట్రం గురించి కన్ఫర్మ్ చేసే సమయంలో చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News