ఆ సినిమా రన్ టైం 2 గంటలు కూడా లేదే..

Update: 2020-01-28 04:24 GMT
మా నిర్మాత మాంచి టేస్ట్ ఉన్నోడోయ్.. అన్న మాట ప్రెస్ మీట్ లో వినిపిస్తుంది కానీ.. సినిమా చూసినప్పుడు మాత్రం కనిపించదు. చాలా డిఫరెంట్ మూవీ అని ప్రతి సినిమా మీడియా మీట్ లో కనీసం అరడజను మంది చెబుతుంటారు. ఆ మాటకు వస్తే.. సినిమా వాళ్లకు అదో ఊతపదం. దానికి ఉండాల్సిన విలువ ఎప్పుడో మిస్ అయి పోయింది. మీడియా ముందుకు వచ్చినప్పుడు.. మైకు దగ్గర కు రాగానే తమ ప్రాజెక్టు భిన్నమైనదన్న విషయాన్ని అదే పనిగా చెబుతారు. మాటల్లో వినిపించే డిఫరెంట్ మాటకు తగ్గట్లు సినిమా విషయంలో కసరత్తు చేస్తే అంతో ఇంతో ప్రయోజనం ఉంటుంది. కానీ.. అలాంటిదేమీ కనిపించదు.

అయితే.. కొందరు నిర్మాతలు.. దర్శకులు కాస్త భిన్నం. రోటీన్ తెలుగు సినిమా కు భిన్నంగా తమ సినిమా ఉండాలని ఫీల్ కావటం ఈ మధ్యన కనిపిస్తుంటుంది. హీరో ఎంట్రీ దగ్గర నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్.. క్లైమాక్స్ ఇలా అన్ని విషయాల్లో వేసుకునే కొలతలకు భిన్నంగా తమ సినిమా ఉండాలని తపిస్తారు. అలా అనుకోవటమే కాదు.. తమ సినిమాను తీసే ప్రయత్నం చేసి సక్సెస్ అయిన వారు కొందరు ఉన్నారు.

ఆ కోవకే వస్తారు రాజ్ కందుకూరి. తాను నిర్మాతగా తీసిన రెండు సినిమాలు భిన్నమైన కోవలోకే చెందుతాయి. పెళ్లి చూపులు.. మెంటల్ మదిలో.. తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకున్నారు. తన రెండు సినిమాలు రోటీన్ కు భిన్నమైన ట్రీట్ మెంట్ తో పాటు.. విజయ్ దేవర కొండ కు గుర్తింపు రావటం లో కీలక భూమిక పోషించారు. ఆయన తాజాగా తీసిన మూవీ చూసీ చూడంగానే.

తన చిత్రానికి దర్శకత్వాన్ని మహిళకు అప్పగించిన ఆయన.. తాను అనుకున్నట్లు సినిమాను తీసినట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తన తొలి చిత్రం పెళ్లిచూపుల రన్ టైం రెండు గంటల ఐదు నిమిషాలు ఉంటే.. రెండో చిత్రం మెంటల్ మదిలో.. రెండు గంటల రెండు నిమిషాలు మాత్రమే. తన తాజా చిత్రమైన చూసీ చూడంగానే కేవలం గంటా యాభై నాలుగు నిమిషాలే కావటం గమనార్హం.

ఇటీవల వస్తున్న సినిమాలు రెండుబ్నావు గంటలు.. రెండున్నర గంటల్ని దాటి పోయి.. దగ్గర దగ్గర మూడు గంటల వరకూ వచ్చేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా రెండు గంటలకు మరో ఆరు నిమిషాల తక్కువ నిడివి తోనే సినిమా చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. పోటీ పడి మరీ నిడివి ఎక్కువ ఉన్న సినిమాలు వస్తున్న వేళ.. తక్కువ నిడివితో ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతమేర ఆదరిస్తారన్నది తేలాలంటే ఈ వీకెండ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.


Tags:    

Similar News