సాయి కుమార్ కొడుకు ఆది హీరోగా నిలదొక్కుకునేందుకు ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. మొదట్లో వచ్చిన జోష్ ని కొనసాగించలేకపోవడం.. సినిమాలు వరుసగా బోల్తా కొట్టేయడంతో నిలదొక్కుకోవాల్సిన పరిస్థితిలో పడిపోయాడు. చుట్టాలబ్బాయి అంటూ ఈసారి గట్టి ప్రయత్నమే చేయబోతున్నాడు. ఇప్పుడు సెన్సార్ పూర్తి చేయించుకుని ఆగస్ట్ 19కి క్యూలో పెట్టేశాడు ఆది.
ఆగస్ట్ 19న చుట్టాలబ్బాయి గ్రాండ్ రిలీజ్ కానుందంటూ ప్రకటించింది మూవీ యూనిట్. అయితే.. ఈసారైనా నమ్మచ్చా అన్నదే అసలు డౌట్. ఎందుకంటే.. ఇప్పటికి రెండుసార్లు డేట్ మార్చారు. మొదట సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కబాలికి పోటీగా జూలై 22న విడుదల అన్నారు. బహుశా కబాలి వాయిదాపడుతుందని ఆ డేట్ ని ఫిక్స్ చేసుకుని ఉంటారు. తీరా కబాలి మేనియా కొట్టుకుపోకూడదని వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత ఆగస్ట్ 5 విడుదల అంటూ మరోసారి ఫిక్స్ అయ్యాడు.
ఈ డేట్ కి వచ్చేందుకు కూడా చుట్టాలబ్బాయికి కుదర్లేదు. దీంతో ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆగస్ట్ 19న రావడం పక్కా అంటున్నారు. ఇప్పుడు సెన్సార్ కాపీ కూడా చేతిలో పడింది కాబట్టి.. విడుదల ఖాయమే అనుకోవచ్చు. యూ/ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే.. ఆది చుట్టాలబ్బాయి లో కూడా మాస్ కంటెంట్ గట్టిగానే చూపించినట్లున్నాడు.