సీఐడీకి ‘ఇండియన్‌ 2’ కేసు

Update: 2020-02-24 13:57 GMT
యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్‌ సీక్వెల్‌ ‘ఇండియన్‌ 2’ షూటింగ్‌ సందర్బంగా ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా పదిమందికి పైగా గాయాల పాలయ్యారు. దర్శకుడు తేజకు కూడా గాయాలు అయ్యాయి. షూటింగ్‌ జరిగిన ప్రమాదంపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆ కేసును ప్రభుత్వం సీబీ సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పోలీసులు క్రేన్‌ ఆపరేటర్‌.. ప్రొడక్షన్‌ మేనేజర్‌ లతో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. దర్శకుడు శంకర్‌ ఇంకా కమల్‌ లను కూడా సీఐడీ వారు ప్రశ్నించబోతున్నారు. కేసు వివరాలను స్వాదీనం చేసుకున్న సీఐడీ వారు ప్రస్తుతం విచారణ మొదలు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. క్రేజ్‌ ఆపరేటర్‌ మరియు ఓనర్‌ లను మొదటగా ప్రశ్నించబోతున్నారు. ఆ తర్వాత తీసుకున్న జాగ్రత్తల గురించి ప్రొడక్షన్‌ మేనేజర్‌ ను ప్రశ్నించబోతున్నారట.

హీరో మరియు దర్శకులను కూడా ఈ విషయమై ప్రశ్నించేందుకు సమయం అడిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఎంక్వౌరీని చాలా స్పీడ్‌ గా పూర్తి చేయాలని దోషులను శిక్షించాలంటూ ఆల్‌ ఇండియా ఫిల్మ్‌ వర్కర్స్‌ అసోషియేషన్‌ తాజాగా సీఐడీ చీప్‌ ను కలిసి విజ్ఞప్తి పత్రంను అందించారు. కేసు ఏ మలుపు తిరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Tags:    

Similar News