మెగాస్టార్-కోటి మ‌ధ్య సినీ రాజ‌కీయం!

Update: 2021-11-10 00:30 GMT
మెగాస్టార్ చిరంజీవి -క్లాసిక్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన చిత్రాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `అల్లుడా మ‌జాకా` నుంచి మొద‌లైన ఆ త్ర‌యం ప్ర‌స్థానం కొన్ని ద‌శాబ్ధాలు పాటు దిగ్విజ‌యంగా కొన‌సాగింది.  కోటి-చిరు కాంబినేష‌న్ అంటేనే అప్ప‌ట్లో మ్యూజిక్ ప్రియుల‌కు ఓ ట్రీట్ లా ఉండేది మెగాస్టార్ కి ఎన్నో క్లాస్..మాస్  బీట్స్ అందించి చిరు స‌క్సెస్ లో  భాగ‌మయ్యారు. ఇద్ద‌రు క‌ల‌సి దాదాపు `హిట్ల‌ర్` సినిమా వ‌ర‌కూ ప‌నిచేసారు. అయితే ఆ త‌ర్వాత స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్ చేతులు క‌ల‌ప‌లేదు. అంత ఫేమ‌స్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కి చిరు మ‌ళ్లీ ఎందుకు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని మీడియాలోనూ ప‌లుమార్లు చ‌ర్చ‌కొచ్చింది.

వాళ్లిద్ద‌రి మ‌ధ్యా కూడా పెద్ద  సినిమా రాజ‌కీయాలే న‌డిచాయని తెలుస్తోంది.  తాజాగా ఆ క‌ల‌యిక బ్రేకింగ్ గురించి  ఆస‌క్తిక‌ర సంగ‌తే ఉంద‌ని కోటి ఓ  ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.`` చిరంజీవి గారు న‌టించిన 12 సినిమాల‌కు సంగీతం అందించాను. కానీ ఓ సంఘ‌ట‌న ఇద్ద‌రి మ‌ధ్య‌ దూరం పెంచింది.  ఓ సినిమా 100 డేస్ వేడుక ఓంగోలులో నిర్వ‌హించారు. మా అత్త‌గారి ఊరు కూడా ఓంగోలుకు ద‌గ్గ‌ర‌ల్లో కావ‌డంతో ఒక రోజు ముందుగానే అక్క‌డికి వెళ్లాను. కానీ అక్క‌డికి వెళ్లిన ద‌గ్గ‌ర నుంచి జ‌లుబు..తీవ్ర‌మైన జ్వ‌రం వ‌చ్చాయి. ఫంక్ష‌న్ కి వెళ్ల‌లేని ప‌రిస్థితి. ఈ విష‌యాన్ని మేనేజ‌ర్ కి ఫోన్ చేసి చెప్పాను.

కానీ ఈ విష‌యం చిరంజీవి గారికి...ఇండ‌స్ర్టీ కి  వేరేలా పాస్ అయింది. నేను కావాల‌నే వెళ్ల‌లేద‌ని మీడియాలో నెగిటివ్ గా ప్ర‌చారం సాగింది. అప్పుడే నా గురించి   లేనిపోనివి అన్ని చిరంజీవి గారికి క‌ల్పించి ఎవ‌రో చెప్పారు. ఆ త‌ర్వాత చిరంజీవిగార్ని క‌ల‌వ‌డానికి వెళ్లినా ఆయ‌న మాట్లాడే ప‌రిస్థితిలో లేర‌ని చెప్పారు. ఆయ‌న అలా రియాక్ట్ అవ్వ‌డంలో త‌ప్పులేదు. ఆయ‌న స్థానంలో ఎవ‌ర‌న్నా అంతే. కార‌ణం ఉండి వెళ్ల‌లేక‌పోయాను కాబ‌ట్టి నేను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అలా ఆ సినిమా వేడుక ఇద్ద‌ర్ని దూరం చేసింద‌ని`` కోటి తెలిపారు.
Tags:    

Similar News