మంచి కంటెంట్ ని తెలివిగా ఎంపిక చేయగలిగితే ఈ రోజుల్లో విజయం కష్టమేమీ కాదు. పనితనం ఉన్న దర్శకరచయితలు విజన్ ని తెరపైకి తేగలిగితే ఓటీటీ సహా పెద్ద తెరపైనా అద్భుత విజయాలు దక్కుతున్నాయి. ఇక నవతరం క్రియేటర్లకు ఓటీటీ గొప్ప వరంగా మారింది. తాజాగా లఘు చిత్రాల దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన సినిమా బండి నెట్ ఫ్లిక్స్ లో చక్కని ఆదరణ దక్కించుకుంటోంది. ఫ్యామిలీమ్యాన్ సిరీస్ సృష్టి కర్తలు నిర్మించిన సినిమాగా దీనికి బోలెడంత ఇమేజ్ ఉంది. కంటెంట్ తో మెప్పించడంతో నెట్ ఫ్లిక్స్ లో ట్రెండీ చిత్రంగా రికార్డులకెక్కింది.
ఓటీటీలో చాలా తెలుగు సినిమాలు జాతీయ అంతర్జాతీయ ప్రజల ఆదరణ చూరగొంటున్నాయి. ఇది ఫిలింమేకర్స్ కి పెద్ద ప్లస్. ఒకరకంగా ప్రవీణ్ వినిపించిన `సినిమా బండి` కథకు ఓకే చెప్పిన రాజ్ అండ్ డీకే బృందాన్ని అభినందించకుండా ఉండలేం.
విడుదలైన మొదటి వారాంతంలో సినిమా బండి నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకులను గొప్పగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రం ట్రెండ్స్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఒక గ్రామస్తుల బృందం వారు కనుగొన్న ఖరీదైన కెమెరాతో సినిమా చేయడానికి ఎలా ప్రయత్నిస్తారనేది ఎంతో హార్ట్ టచింగ్ గా తెరపైకి తెచ్చారు దర్శకులు. గ్రామస్తుల హాస్యం .. అమాయకత్వంతో నిండిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే కొత్త నటీనటులు సహజమైన డైలాగ్ లతో సాధ్యమైనంత వాస్తవికతతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం ప్లస్ గా మారింది.