ఒకడు బాగున్నా.. నలుగురు తొక్కుతున్నారా?

Update: 2017-01-01 16:30 GMT
అదేంటో తెలియదు.. కొన్ని సినిమాలకు చాలామంచి టాక్ వస్తుంది కాని చూస్తే మాత్రం కలక్షన్లు తక్కువగా ఉంటాయ్. దానికి కారణం ఏంటంటే.. ఎక్కువ ధియేటర్లలో ఆ సినిమా లేకపోవడం. కాని ఇక్కడ దుస్థితి ఏంటంటే.. ఒక్కోసారి అలాంటి మంచి సినిమాలకు ధియేటర్లు కూడా దొరకవ్ తెలుసా. అదిగో ఇప్పుడు ''అప్పట్లో ఒకడుండేవాడు'' సినిమాకు అదే పరిస్థితి ఎదురైందట.

నారా రోహిత్.. శ్రీవిష్ణు.. లీడ్ రోల్స్ లో డైరక్టర్ సాగర్ చంద్ర రూపొందించిన ఈ 90ల నాటి సినిమా.. క్రిటిక్స్ అందరినీ బాగా ఆకట్టుకుంది. అయితే సోమవారం నుండి ఈ సినిమాకు ధియేటర్లు పెరిగితే.. సినిమా కలక్షన్ల స్థాయి పెరుగుతుంది అంటున్నారు ట్రేడ్ పండితులు. కాని అక్కడ ధియేటర్లు అనేవి దొరక్కుండా ఓ నలుగురు తొక్కేస్తున్నారు అంటూ టాక్ వస్తోంది. కలక్షన్లు బాగానే కనిపించడంతో అల్లు అరవింద్ తన అధీనంలో ఉన్న ధియేటర్లన్నీ.. ఖైదీ నెం 150 రిలీజ్ అయ్యేవరకు 'ధృవ'కే కట్టబెట్టేశారట. ఇక టాక్ బిలో యావరేజ్ గా వచ్చినా కూడా సురేష్‌ బాబు తన చేతిక్రింద ఉన్న ధియేటర్లలో 'పిట్టగోడ'ను ఆడిస్తున్నారు. మిగతా ధియేటర్లన్నీ ఇక దిల్ రాజు దగ్గరే ఉన్నాయి. ఆయన కూడా శతమానం భవతి వచ్చే వరకు 'నాన్న నేను నా బాయ్‌ ఫ్రెండ్స్' సినిమాను రన్ చేస్తారట. ఇక నైజాంకు చెందిన అభిషేక్ పిక్చర్స్ దగ్గర కొన్ని ధియేటర్లు ఉన్నాయిగా.. వాటిలో 'వంగవీటి' వేసి దంచుతున్నారు. ఈ మధ్యలో 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాకు ధియేటర్లు దొరుకుతాయా మరి?

అయితే ఇక్కడ తొక్కడంలాంటివి కాదులే కాని.. దటీజ్ బిజినెస్ అంటున్నారు సినిమా వర్గాలు. రోహిత్ కాస్త వెయిట్ చేసి మాంచి టైమ్ చూసి రిలీజ్ చేసుంటే బాగుండేదని పలువురి అభిప్రాయం. అలాగే అప్పట్లో ఒకడుండేవాడు సినిమాకు పెద్దలు కూడా ధియేటర్లు ఇస్తే బాగుంటుందని ఇంకొందరి అభిప్రాయం. లెటజ్ సీ.
Tags:    

Similar News