నానీ వ్యాఖ్య‌ల‌కు సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కౌంట‌ర్

Update: 2021-07-29 15:54 GMT
నేచుర‌ల్ స్టార్ నాని థియేట‌ర్ల వ్య‌వ‌స్థ‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని నిల‌దీస్తూ ఓ సినీవేడుక‌లో సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌బ్బుల్లో..క్ల‌బుల్లో మాస్క్ లు తీసి ఎంజాయ్ చేసే వారికంటే థియేట‌ర్లో మాస్క్ పెట్టుకుని... ఒకేవైపు చూస్తూ సినిమా చూసే వాళ్లే సుర‌క్షితం. కానీ థియేట‌ర్లో సినిమాకి వ‌స్తే క‌రోనా వ‌చ్చేస్తుంద‌ని బెదిరిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఏదైనా వ‌స్తే ముందుగా మూసేసేది థియేట‌ర్లు...చివ‌రిగా తెరిచేది కూడా సినిమా  థియేట‌ర్లే. సినిమా వాళ్లంతా రోడ్డున ప‌డుతున్నారు. మ‌రి ఈ చిన్న చూపు దేనికంటూ! ప్ర‌శ్నించారు నానీ.

నాని చేసిన ఈ  వ్యాఖ్య‌లిప్పుడు రాజ‌కీయంగా పెద్ద దుమార‌మే రేపుతున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సీన్ లోకి తెలంగాణ రాష్ట్ర‌  సినిమాటోగ్ర‌పీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ ఎంట‌ర్ అయ్యారు. నాని వ్యాఖ్య‌ల‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చే  ప్ర‌య‌త్నం చేసారు. మా ప్ర‌భుత్వం నుంచి థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌కి ఎలాంటి అడ్డంకులు  లేవు. సినిమా థియేట‌ర్లు తెరుచుకోమ‌ని... సింగిల్ స్క్రీన్  థియేట‌ర్లో పార్కింగ్ ఫీజులు వ‌సూల్  చేసుకోమ‌ని చెప్పాం.  కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ థియేట‌ర్లు తెర‌వ‌లేదు. దానికి ప్ర‌భుత్వం కార‌ణ‌మా?  ప్ర‌జా ప్ర‌తినిధులు కార‌ణ‌మా? అని ప్ర‌శ్నించారు.

సినిమా రిలీజ్ ల‌కు నిర్మాత‌లు ముందుకు రాక‌పోతే మేము ఏం చేయ‌గ‌ల‌మ‌ని చుర‌క‌లంటించారు. అయితే నిర్మాత‌లు... ఎగ్జిబిట‌ర్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో థియేట‌ర్లు ఓపెన్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల తెలంగాణ‌లో స్ప‌ష్ట‌త లోపించిన మాట వాస్త‌వం. అయిన‌ప్ప‌టికి ధైర్యంగా ఈనెల 30 నుంచి థియేట‌ర్లో బొమ్మ  వేయ‌డానికి తెలంగాణ ఎగ్జిబిట‌ర్లు ముందుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. అయినా క‌రోనా అంద‌రినీ క‌న్ఫ్యూజ్ చేస్తోంది. ఎవ‌రి వ‌ల్ల ఏ స‌మ‌స్య వ‌స్తోంది? అన్న‌ది అర్థం చేసుకోవ‌డం క‌ష్ట‌మే. ఇక ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌ల స‌వ‌ర‌ణ పెనువిఘాతంగా మారింది. అందుకే థియేట‌ర్లు తెర‌వ‌డం లేద‌న్న‌ది సుస్ప‌ష్ఠం. కానీ నానీ ప్ర‌శ్న‌కు ఏపీలో ఎవ‌రూ స్పందించ‌లేదేమిటో!
Tags:    

Similar News