విలక్షణ దర్శకుడిగా పేరున్న దేవ కట్టా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో రూపొందించిన 'రిపబ్లిక్' సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా పై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విడుదల అయిన తర్వాత అందరిని ఆకట్టుకునే కంటెంట్ ఈ సినిమా లో ఉందంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. భారీ అంచనాలున్న రిపబ్లిక్ సినిమా విడుదల తేదీ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. గత నెలలోనే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా సెకండ్ వేవ్ వల్ల సినిమా వాయిదా పడింది. థియేటర్లు ఈ నెల చివరి నుండి పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఆగస్టులో పలు సినిమాలు విడుదల అవ్వబోతున్నాయంటున్నారు.
ఆగస్టులో కొన్ని సినిమాలు విడుదలకు ఇప్పటికే తేదీలు అనధికారికంగా ఫిక్స్ అయ్యాయి. కనుక ఆగస్టులో రిపబ్లిక్ మూవీకి ఛాన్స్ లేదని... కనుక ఈ సినిమా ను సెప్టెంబర్ లో విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారంటూ వార్తలు వస్తున్నాయి. రిపబ్లిక్ మూవీ ని అన్ని అనుకున్నట్లుగా జరిగితే థర్డ్ వేవ్ ఆందోళన లేకుంటే సెప్టెంబర్ 3న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వినాయక చవితికి విడుదల చేయాలనుకున్నా ఇప్పటికే ఆ తేదీ బుక్ అయ్యిందట. అందుకే చవితికి ముందు వారమే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
రిపబ్లిక్ విడుదల తేదీ విషయంలో అతి త్వరలోనే మేకర్స్ ఒక క్లారిటీ ఇస్తారని మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. థియేటర్ల పరిస్థితి ఎలా ఉన్నా కూడా మేకర్స్ త్వరలోనే రిపబ్లిక్ విడుదల తేదీని ప్రకటిస్తారు. అప్పటి వరకు థియేటర్లు పునః ప్రారంభం కాకున్నా.. మళ్లీ కరోనా మొదలైనా విడుదల వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కరోనా థర్డ్ వేవ్ విషయమై ఖచ్చితమైన సమాచారం లేదు కనుక సెప్టెంబర్ మొదటి వారంలో రిపబ్లిక్ విడుదల అన్ని విధాలుగా మంచి నిర్ణయం అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. కనుక అదే తేదీని అధికారికంగా ప్రకటించి విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నారట.