ఎన్టీఆర్ రేడియేషన్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేనా..?

Update: 2021-04-17 02:30 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని ఆ మధ్య క్లారిటీ కూడా వచ్చేసింది. 'కేజీఎఫ్ 2' తర్వాత తారక్ తోనే ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్న సమయంలో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'సలార్' అనే మూవీ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు ప్రశాంత్. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ లైనప్ లో చోటు చేసుకున్న మార్పుల వల్ల మళ్ళీ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా.. ప్రశాంత్ నీల్ తో ఓ మూవీ ఉంటుందని కన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడమే కాకుండా.. కొరటాల శివతో '#NTR30' మూవీ లైన్ లోకి వచ్చింది. త్రివిక్రమ్ సినిమాని పక్కన పెడితే ఇంక క్లారిటీ రావాల్సింది ప్రశాంత్ నీల్ చిత్రంపైనే. రేడియేషన్ ప్రాజెక్ట్ అంటూ అభిమానుల్లో అంచాలను పెంచిన ఈ సినిమా ఉంటుందా లేదా అన్నది ప్రశ్నగా మిగిలిపోయింది.

'సలార్' షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత తారక్ సినిమా ఉంటుంది అనుకోడానికి.. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తో చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆఫీస్ కి వెళ్లి బన్నీని కలవడం ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ - అల్లు అర్జున్ ఇద్దరూ దర్శకులను పరస్పరం మార్చుకున్నారేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే తారక్ - ప్రశాంత్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News