అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' సినిమా రూపొందుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్టు పార్టుకు సంబంధించిన చిత్రీకరణ 90 శాతం వరకూ పూర్తి చేశారు. మిగతా 10 శాతం చిత్రీకరణలో ఈ సినిమా టీమ్ బిజీగా ఉంది. అది కూడా ఈ పాటికి పూర్తయ్యేది. కానీ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఆలస్యమైంది. మైత్రీ మూవీ మేకర్స్ .. ముత్తంశెట్టి మీడియా వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తుండగా, ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.
ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని బన్నీ అభిమానులంతా వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా మేకర్స్ చెప్పారు. అయితే డిసెంబర్ 17వ తేదీన వస్తుందా? లేదంటే ఆ తరువాత వారం వస్తుందా ? అనే సందేహం అభిమానుల్లో తలెత్తింది. ఆ రోజు కోసం అభిమానుకులంతా ఆసక్తితో ... ఆత్రుతతో ఎదురుచూస్తుంటే, అసలు ఈ సినిమా డిసెంబర్లో రావడం లేదనే ఒక టాక్ గుప్పుమంది. అనుకున్నట్టుగా షూటింగు జరగకపోవడం వలన, డిసెంబర్లో ఈ సినిమా థియేటర్లకు రావడం లేదని చెప్పుకోవడం మొదలైంది.
డిసెంబర్ 24వ తేదీన 'ఆచార్య' విడుదల కానుందనే పుకారుతో, ఇక 'పుష్ప' రావడం లేదనే టాక్ గేట్లు తెంచుకుంది. 'పుష్ప' సినిమా వచ్చే ఏడాదిలోనే విడుదల కానుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల విషయంలో స్పష్టతను ఇవ్వడానికి మేకర్స్ రంగంలోకి దిగవలసి వచ్చింది. సినిమాను డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ఒక అధికారిక ప్రకటన చేస్తూ, రిలీజ్ డేట్ తో కూడిన ఒక పోస్టర్ ను వదిలారు. పుకారిస్టుల దూకుడుకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక ఇప్పుడు బన్నీ అభిమానులకు టెన్షన్ లేదు .. ఈ సినిమా సృష్టించనున్న కొత్త రికార్డులపై వాళ్లు చర్చలు పెట్టుకోవాలంతే.
'పుష్ప' సినిమా .. బన్నీ లుక్ తోనే అందరిలో ఒక రకమైన ఉత్కంఠను రేకెత్తించింది. తన ప్రతి సినిమాకు కొత్తగా కనిపించడానికి బన్నీ ప్రయత్నిస్తూ ఉంటాడు. వాటన్నిటికీ భిన్నమైన లుక్ తో ఆయన కనిపించడంతోనే అంచనాలకు అంకురార్పణ జరిగిపోయింది. అప్పటి నుంచి ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అంతా ఆసక్తిని కనబరుస్తూ వచ్చారు. వాళ్లలో మరింత కుతూహలాన్ని పెంచుతూ ఈ సినిమా నుంచి ప్రచార చిత్రాలు వచ్చాయి.
ఫస్టు సింగిల్ రిలీజ్ తరువాత ఈ సినిమాపై క్రేజ్ కి ఆకాశమే హద్దుగా నిలిచింది.
సాధారణంగా చాలా కథల్లో అవినీతిని ప్రశ్నించేవాడిగా .. అక్రమాలను ఎదిరించేవాడిగా హీరో కనిపిస్తాడు. కానీ ఈ సినిమాలో స్మగ్లింగ్ ముఠాలో ముఖ్యమైన సభ్యుడిగా హీరో కనిపిస్తున్నాడు. ఆయన అలా ఎందుకు మారవలసి వచ్చింది? దాని వెనుకగల బలమైన కారణాలు ఏమిటి? అనేవి అందరిలో ఆసక్తిని రేకెత్తించే ప్రశ్నలు. వాటికి సమాధానాలు రిలీజ్ రోజున థియేటర్లలో దొరకాల్సిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమా మెయిన్ పిల్లర్స్ లో ఒకటిగా కనిపిస్తోంది. ఇక ఫొటోగ్రఫీ ఒక రేంజ్ లో ఉందనే విషయం కూడా అర్థమైపోతూనే ఉంది.
బన్నీ లుక్ .. రష్మిక లుక్ .. ఫహాద్ ఫాజిల్ లుక్ .. ఇలా చూస్తూ వెళుతూ ఉంటే, ప్రతి పాత్రను సుకుమార్ ఎంత ప్రత్యేకంగా డిజైన్ చేయించాడనే విషయం స్పష్టమవుతోంది. ఇక ఈ సినిమాలో సునీల్ కూడా నెగెటివ్ షేడ్స్ కలిగిన రోల్ చేశాడనేది మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. జగపతిబాబు .. ప్రకాశ్ రాజ్ .. హరీశ్ ఉత్తమన్ పోషించిన కీలకమైన పాత్రలు, అనసూయ చేసిన ప్రత్యేకమైన పాత్ర కథా బలానికి అద్దం పడుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా, వసూళ్ల పరంగా చేసే విన్యాసాల కోసం ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది.