స్టైలిష్ స్టార్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీపై క్లారిటీ రావడం లేదే..!

Update: 2021-04-14 11:30 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ''పుష్ప''. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది వీరిద్దరికీ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇందులో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటిస్తుండగా.. ఆయనకు జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఆగస్ట్ 13న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే 'పుష్ప' సినిమా అనుకున్న సమయానికి రాకపోవచ్చని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

'పుష్ప' సినిమా షూటింగ్ ఇంకా సగం ఉందని.. ప్రస్తుత పరిస్థితుల్లో అది మరింత ఆలస్యం కానుందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ నుంచి డిసెంబర్ కు లేదా వచ్చే సంక్రాంతికి  షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి తోడు అల్లు అర్జున్ తో తదుపరి సినిమా అనౌన్స్ చేసిన డైరెక్టర్ కొరటాల శివ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. దీంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. కానీ ఇంతవరకు చిత్ర యూనిట్ నుంచి దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. మరి దీనిపై ఓ స్టేట్మెంట్ వదిలి స్పష్టత ఇస్తారేమో చూడాలి. కాగా, 'పుష్ప' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా సంస్థలు కలిసి దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్ - జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
Tags:    

Similar News