వికాస్ వశిష్ట, ప్రియ వడ్ల మాని, చైతన్యరావ్ , అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `ముఖ చిత్రం`. `కలర్ ఫొటో` చిత్రంతో ఫీల్ గుడ్ హిట్ ని సొంతం చేసుకున్న సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ కె ఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్ పై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫన్ అండ్ ఇంటెన్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రంలోని `క్లాస్ రూమ్ లో..` అంటూ సాగే లిరికల్ వీడియోని గురువారం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విడుదల చేశారు. సాంగ్ చాలా బాగుందని, సినిమా హిట్ కావాలని చిత్ర బృందాన్ని అభినందించారు. క్లాస్ రూమ్ జ్ఞాపకాల నేపథ్యంలో సాగే ఈ పాట ప్రతీ ఒక్కరికీ తమ చైల్డ్ హుడ్ క్లాస్ రూమ్ డేస్ ని గుర్తు చేస్తుంది. `నువ్వెక్కడుంటే నేనక్కడుంటా నువ్వంటే నాకు ఎంతిష్టమో ప్రతి ఒక్క చోటా అతుక్కుపోతా నీ నుంచి దూరం ఎంత కష్టమో..` అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ పాటని చిత్రీకరించిన తీరు కూడా ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటని సింధూరి, విశాల్ కలిసి ఆలపించారు. మెలోడీ ప్రధానంగా సాగే ఈ పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. విభిన్నమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ, ఎడిటింగ్ పవన్ కల్యాణ్, సమర్పణ ఎస్ కె ఎన్, నిర్మాతలు ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల, కథ, స్క్రీన్ ప్లే, మాటలు సందీప్ రాజ్, దర్శకత్వం గంగాధర్.
Full View