నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'క్లైమాక్స్'. పొలిటికల్ సెటైరికల్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ - శివ శంకర్ మాస్టర్ - శ్రీరెడ్డి - సాషా సింగ్ - రమేష్ - చందు ఇతర కీలక పాత్రలు పోషించారు. బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రఖ్యాత వ్యాపారవేత్త పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కనిపించనున్నారు. ఇప్పటికే 'క్లైమాక్స్' ఫస్ట్ లుక్ విడుదల కాగా.. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను రాజేంద్ర ప్రసాద్ విడుదల చేశారు.
'డ్రీమ్' అనే సినిమాతో ఏడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డ్స్ గెలుచుకున్న కే భవాని శంకర్ 'క్లైమాక్స్' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై పి.రాజేశ్వర్ రెడ్డి - కె.కరుణాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రాజేష్ నిధివన సంగీతం అందించగా రవికుమార్ నీర్ల సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. భవాని శంకర్ తో 'డ్రీమ్' అనే సైకలాజికల్ థ్రిల్లర్ లో పని చేసాను. ఇప్పుడు కామెడీ, లవ్, ఫామిలీ డ్రామా, పొలిటికల్ సెటైర్ ఇలా మల్టీ జానర్ కథతో వస్తున్నాం. ప్రస్తుతం విడుదల చేసిన క్లైమాక్స్ చిత్ర మోషన్ పోస్టర్ మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేలా ఉండే మా చిత్రాన్ని త్వరలోనే మీ అందరి ముందుకు తీసుకొస్తాం'' అని చెప్పుకొచ్చారు.
Full View