చిత్రం : క్లైమాక్స్
నటీనటులు : మియా మల్కోవా - రెనాన్ సేవరో
సంగీతం : రవి శంకర్
ఛాయాగ్రహణం : అగస్త్య మంజు
నిర్మాత : ఏ కంపెనీ/ఆర్.యస్.ఆర్ ప్రొడక్షన్
రచన - దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శృంగార తార మియా మాల్కోవాతో తీసిన హారర్ - యాక్షన్ థ్రిల్లర్ 'క్లైమాక్స్'. హారర్ సినిమాలు చీకట్లో పాడుబడ్డ బంగ్లాల్లో భయంకర ప్రదేశాల్లో తీస్తారు.. కానీ ఈ సినిమా ఎడారిలో పగటిపూట పూర్తి వెలుతురులో తీసిన ఫస్ట్ సినిమా అంటూ వర్మ పేర్కొన్న 'క్లైమాక్స్' మూవీ ఆర్జీవీ వరల్డ్ థియేటర్- శ్రేయాస్ ఎంటర్ టైన్ మెంట్ ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్) లో పే ఫర్ వ్యూ విధానంలో ఆన్ లైన్ లో రిలీజ్ అయింది. ట్రైలర్ తో అలజడి సృష్టించిన వర్మ 'క్లైమాక్స్' విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...!
కథ :
ఓ యువ జంట ఎంజాయ్ చేయడం కోసం ఎడారికి ట్రిప్ కి వెళ్తుంది. అక్కడ వారికి అసహజమైన సంఘటనలు విచిత్రమైన మనుషులు ఎదురవుతారు. వాటిని ఆ జంట ఎలా ఎదుర్కొంది.. ఎడారిలో ఉన్న విచిత్రమైన మనుషులు ఎవరు.. అక్కడి నుండి ఆ జంట బయట పడిందా లేదా అనేదే ఈ 'క్లైమాక్స్' స్టోరీ.
కథనం - విశ్లేషణ :
''అసహజమైన విషయాలను మనం ఎక్స్ ప్లెయిన్ చేయలేం. ఒకవేళ ఎక్స్ ప్లెయిన్ చేయగలిగితే అది అసహజమైనది కాదు'' అనే కొటేషన్ తో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ఇది చూసిన సగటు ప్రేక్షకుడు వర్మ ఏ రేంజ్ లో భయపెడతాడో అని అనుకోక మానడు. అయితే మొదటి పది నిముషాలు మియా మల్కోవా తన బాయ్ ఫ్రెండ్ రెనాన్ సేవరో తో కలిసి ఎడారికి వెళ్లడం.. అక్కడ నో ఎంట్రీ అని బోర్డు చూసి వెనుకడుగు వేయకుండా ఆ జంట ముందుకు వెళ్లడం.. ఎడారిలో ఉన్న ఒయాసిస్ దగ్గర రొమాన్స్ చేసుకోవడం లాంటి సీన్స్ తో కథను నడిపించాడు వర్మ. అక్కడి నుండి క్లైమాక్స్ వరకు అసహజమైన సంఘటనలు జరుగుతున్నట్లు.. విచిత్రంగా బిహేవ్ చేసే మనుషులను చూపించిన వర్మ భయపెట్టే ప్రయత్నం చేసాడు. ఎడారిలో రొమాన్స్ చేసుకుంటున్న ఆ జంటకి బైక్ లపై రైడింగ్ కి వచ్చిన కొంతమంది కనిపిస్తారు. వారందరు కలిసి ఒక అమ్మాయిని వెంబడించడం.. ఏదో జరుగుతుందని భావించిన ఈ జంట అక్కడి నుండి వేరే చోటికి వెళ్లి రొమాన్స్ చేస్తుండగా ఒక బాలుడు సెల్ ఫోన్ లో షూట్ చేస్తాడు. అతడి నుండి మొబైల్ తీసుకునే ప్రయత్నంలో బాలుడు చనిపోయినట్లుగా క్రిందపడిపోతాడు. దీంతో ఈ జంట అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ పై ఓ ఇంటికి పోలీస్ స్టేషన్ అని బోర్డు చూసి కంప్లైంట్ చేయడానికి వెళ్లడం.. హీరో మీద అటాక్ జరగడం.. హీరోయిన్ ని తీసుకెళ్లి చంపే సమయంలో హీరో వచ్చి ఆమె ని సేవ్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం.. మిగతా కథ. దీనికి కథ అని పేరు పెట్టడం కంటే వర్మ శైలిలో ఇంకేమైనా పేరు ఆలోచించవచ్చు. హారర్ సినిమాలు చీకట్లో భయంకర ప్రదేశాల్లో తీస్తారు.. కానీ నేను ఈ సినిమా ఎడారిలో పగటిపూట పూర్తి వెలుతురులో తీసాను అని వర్మ చెప్పినట్లే ఒకటి రెండ్లు సీన్లు మినహా ఈ సినిమా డే టైంలోనే జరుగుతుంది.
కాకపోతే హారర్ సినిమాకి ఉండే లక్షణాలు ఈ మూవీలో ఎక్కడా కనిపించకపోగా వర్మ చెప్పిన రేంజ్ లో భయం కలిగించే సన్నివేశాలైతే లేవనే చెప్పాలి. కాకపోతే 'క్లైమాక్స్' సినిమా క్లైమాక్స్ కి వచ్చిన తర్వాత డైరెక్టర్ ఎప్పటి లాగే తను మొదటి నుండి తీస్తున్న పాత చింతకాయ పచ్చడే థియేటర్స్ లో కాకుండా ఈ సారి ఏటీటీలో చూపించాడనే ఫీలింగ్ కలగక మానదు. వర్మ గత చిత్రాలు 'దెయ్యం' 'రాత్రి' సినిమాలు పగటి పూట తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సినిమా. ఓల్డ్ వోడ్కాని తెచ్చి న్యూ బాటిల్ లో పోసినట్లుగా అన్నమాట. అంతేకాకుండా మియా మాల్కోవా నుండి ఎక్కువగా ఎక్స్ పెక్ట్ చేసి చూసిన ఆడియన్స్ మాత్రం డిజప్పోయింట్ అవుతారు. ఎడారిలో పరుగెత్తే అందాలను చూసి ఎంజాయ్ చేద్దాం అనుకునే లోపు రయ్ రయ్ మంటూ బైక్ సౌండ్స్ వచ్చి చూసే ఆడియన్ కి చికాకు తెప్పిస్తాయి. వీటి వళ్ళ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే క్లైమాక్స్ ఎప్పుడొస్తుందా అని సగటు ప్రేక్షకుడు అనుకోకమానడు. గత రెండు నెలల నుండి థియేటర్స్ లో సినిమాలు లేక కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సినీ లవర్స్ 'క్లైమాక్స్' మీద ఒక లుక్కిస్తే మాత్రం నిరాశ చెందుతారు. మొత్తం మీద 52 నిమిషాల నిడివి గల 'క్లైమాక్స్' షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ సినిమాకి తక్కువ అని చెప్పవచ్చు.
నటీనటులు :
ప్రధాన పాత్రలో నటించిన మియా మల్కోవా సినిమాని క్లైమాక్స్ వరకు మోసిందని చెప్పాలి. ఎడారిలో మిట్ట మధ్యాహ్నం బికినీ ధరించి.. కొన్ని సీన్స్ లో నగ్నంగా నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే జీఎస్టీలో మియా మల్కోవాని చూసి ఏదో ఎక్స్ పెక్ట్ చేసి ఈ సినిమా చూస్తే మాత్రం నిరాశ తప్పదనే చెప్పాలి. ఇక మరో ముఖ్య పాత్రలో నటించిన రెనాన్ సేవరో ఆమెకు సహాయకుడిగా మిగిలిపోయాడు. 'వాట్ ఈజ్ హ్యాపెనింగ్' 'ఐ డోంట్ నో' డైలాగ్స్ కి మాత్రమే పరిమితమయ్యాడు. మియాతో రొమాన్స్ చేసే సీన్స్ లో మాత్రం రెచ్చిపోయి నటించాడు. సినిమాలో మిగతా పేరు తెలియని ఆర్టిస్ట్స్ గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అందరూ వర్మ చెప్పినట్లు కెమెరా ముందు నడుచుకొని వెళ్లిపోయారు.
సాంకేతిక వర్గం :
క్లైమాక్స్ కి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన వర్మ కెరీర్ కి ఈ సినిమా క్లైమాక్స్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే అదే టేకింగ్ తో అదే స్క్రీన్ ప్లే తో 'క్లైమాక్స్'ని క్లైమాక్స్ వరకు తీసుకొచ్చాడు. కేవలం మియా మాల్కోవా అందాలపై ఫోకస్ పెట్టిన డైరెక్టర్ కథ కథనం మీద పెట్టలేదనే అర్థం అవుతుంది. మియా మేల్కొవాని ఎన్ని యాంగిల్స్ లో అందంగా చూపించాలనే విషయంలో మాత్రం ఆర్జీవీ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సెన్సార్ కూడా లేకపోవడంతో రెచ్చిపోయిన వర్మ కిస్సింగ్ సీన్స్.. నగ్న దృశ్యాలు.. మియా మాల్కోవా తొడల సీన్స్ తో నింపేసాడు. కానీ స్టోరీ మీద ఫోకస్ పెట్టలేకపోయాడు. 'క్లైమాక్స్'తో వర్మ సినిమా కంటే ట్రైలర్ బాగుంటుందని మరోసారి నిరూపించుకున్నాడు. ఇక అగస్త్య మంజు కెమెరా పనితనం పర్వాలేదనే చెప్పుకోవాలి. టైటిల్స్ పడుతున్నప్పటి నుండి క్లైమాక్స్ వరకు కూడా కొత్త కొత్త యాంగిల్స్ లో ఆయన తీసిన విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఎడారిలో హీరోయిన్ నడుము మధ్యలో నుండి సూర్యుడిని చూపించే షాట్ ఆయన పనితనాన్ని తెలుపుతుంది. అంతేకాకుండా ఎడారిలో మియా అందాలను బాగా క్యాప్చర్ చేసాడనే చెప్పుకోవాలి. ఇక రవి శంకర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా బాగుంది అనిపించినా ఆయన గత చిత్రం 'ఆఫీసర్'ని గుర్తుకు తెస్తూ ఉంటుంది.
చివరగా : 'క్లైమాక్స్' షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ సినిమాకి తక్కువ!!!
రేటింగ్ : 0.5/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre