భీమ్లా నాయ‌క్ వ‌ర్సెస్ వ‌లీమై: 3 రోజుల్లో ఎవరెంత‌?

Update: 2022-03-01 11:30 GMT
ఒక స్టార్ హీరో రేంజ్ ఎంత‌? అన్న‌ది అంచ‌నా వేయ‌డానికి కొల‌మానం ఏమిటీ?  బాక్సాఫీస్ ఓపెనింగ్స్ ఇవీ ఫిగ‌ర్స్ ఇవీ అంటూ లెక్క‌లు వేస్తే తాజా రిజ‌ల్ట్ స‌రిపోతుంది. ప్రేక్ష‌కుల రీచ‌బిలిటీకి కూడా ఇది సింబాలిక్ గా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల‌ ఒక రోజు తేడాతో విడుద‌లైన అజిత్ వలీమై... ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ్లా నాయ‌క్ .. ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ ఫ‌లితం ఎలా ఉంది? అన్న‌ది పోల్చి చూస్తే ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు వెలుగు చూశాయి. త‌ళా అజిత్ న‌టించిన వ‌లీమై వ‌ర‌ల్డ్ వైడ్ 3 రోజుల్లో 110కోట్లు వ‌సూలు చేయ‌గా.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ కేవ‌లం 3 రోజుల్లోనే 100కోట్లు వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూలు చేసింది.

నిజానికి వ‌లీమై డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుని ఇంత వ‌సూళ్లు తేగా.. భీమ్లా నాయ‌క్ బంప‌ర్ హిట్ అన్న టాక్ తెచ్చుకుని మ‌రీ ఇంచుమించిగా అంతే వ‌సూలు చేసింది. ఇక‌పోతే ప‌వ‌న్ సినిమాకి ఏపీలో టికెట్ ధ‌ర కూడా పెద్ద అడ్డంకిగా నిలిచింద‌న‌డంలో సందేహం లేదు. ఇక ఫ్లాప్ అయినా కానీ త‌ళా వంద కోట్ల క్ల‌బ్ లో చేర‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అది అత‌డి స్టార్ రేంజును ఆవిష్క‌రిస్తోంది. ఇక భీమ్లా నాయ‌క్ తొలి ఐదురోజుల్లో ఎంత వ‌సూలు చేసింది? అన్న‌ది టీమ్ వెల్ల‌డించాల్సి ఉంటుంది.

వారాంతంలో బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా మంచి ప్రదర్శన కనబరిచిన వ‌లీమై ఐదవ రోజు కలెక్షన్ ల ప‌రంగా గ్రాఫ్ కిందికి పడిపోయింది. నాన్‌ హాలిడేలో విడుదలైనప్పటికీ ఈ చిత్రం నాలుగు రోజుల పాటు భారీ వసూళ్లను రాబట్టింది. అయితే సోమవారం ఈ సినిమా వసూళ్లు ఊహించ‌ని స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశీయంగా 100 కోట్లు రాబట్టడం కాస్త కష్టమేన‌ని టాక్. బాక్సాఫీస్ ఇండియా రిపోర్ట్ దాని 5 వ రోజు వసూళ్ల గురించి మాట్లాడుతూ, ``తమిళ చిత్రం వ‌లీమై క‌లెక్ష‌న్ల ప‌రంగా పడిపోయింది. సోమవారం 4-5 కోట్ల నెట్ రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. భారతదేశంలో ఇంకా వంద కోట్ల క్ల‌బ్ లో చేరాల్సి ఉంటుంది.

ఈ చిత్రం వారాంతంలో బాగా ఆడింది... కానీ కంటెంట్ లేకపోవడంతో సినిమా స్టార్ పవర్ తోనే ఆడుతోంది. తమిళనాడులో ఐదు రోజుల‌ తర్వాత  దాదాపు 66 కోట్ల నికర వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఇదిలా ఉంటే అజిత్ నటించిన చిత్రం మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్క్ ను దాటింది. బాక్సాఫీస్ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ. 111 కోట్లు వసూలు చేసి త్వరలో 150 కోట్ల మార్క్ కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వ‌లీమై ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇది అజిత్ కుమార్ పోషించిన ACP అర్జున్ కుమార్ IPS కథను తెర‌పై ఆవిష్కరించారు. అతను మధురైకి చెందిన ఒక పోలీసు అధికారి. చెన్నైకి వ‌చ్చాక ఏం జ‌రిగింది? అన్న‌ది ఆస‌క్తిక‌రం. హింసాత్మకమైన బైకర్ల గుంపును -- సాతాను బానిస అని పిలవబడే -- క్రూరమైన నేరాలలో వారి ప్రమేయం తర్వాత ట్రాక్ చేయడానికి నియమించబడిన అధికారి గా అర్జున్ (అజిత్) వస్తారు. నరేన్ అ.కా. వోల్ఫ్రాంగా (కార్తికేయ గుమ్మకొండ) పేరుమోసిన వ్యాపారాన్ని నడిపే ముఠా నాయకుడు.

క్రూరమైన దొంగతనాలు .. హత్యలకు పాల్పడే ముఠా నగరంపై వారి నియంత్రణను విస్తరిస్తుంది. ఈ సమూహాన్ని వేటాడడంలో అర్జున్ (అజిత్‌) ఎలా విజయం సాధించాడు. అతను తీవ్రంగా బాధపడుతున్న నగరాన్ని బైకర్ల ముఠా నుండి ఎలా రక్షించాడు? వారి నాయకుడి అస‌లు క‌థేంటి? అన్న‌ది తెర‌పైనే చూడాలి. అయితే మూవీ స‌రైన కంటెంట్ లేక‌పోవ‌డంతో డిజాస్ట‌ర్ అన్న స‌మీక్ష‌లు వ‌చ్చాయి. అయితే స‌మీక్ష‌ల‌తో సంబంధం లేకుండా వ‌సూళ్లు సాగించ‌డం ఆస‌క్తిక‌రం.
Tags:    

Similar News