సినీ పరివ్రమను ఉద్దేశించి ఒక టీవీ ఛానెల్ న్యూస్ ప్రెజెంటర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. దీనిపై ఇండస్ట్రీ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరఫున ఒక ప్రెస్ మీట్ పెట్టి పలువురు నటీనటులు న్యూస్ ప్రెజెంటర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సినిమాల్లోనే కాక బయట కూడా ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ నవ్విస్తూ ఉండే ఆలీ సైతం ఈ కార్యక్రమంలో ఉగ్ర రూపం దాల్చాడు.
మీడియా, ఆర్టిస్టులు మొగుడు పెళ్లాల వంటి వారని.. ఏదైనా గొడవ వస్తే ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండాలే తప్ప పబ్లిక్ లోకి వెళ్తే నవ్వుల పాలైపోతామని ఆలీ అన్నాడు. హీరోయిన్ల గురించి ఓ టీవీ చానల్ లో అలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయమని.. అది ఛానల్ కాబట్టి ఏమీ చెప్పలేక పోతున్నామని.. అదేరోడ్డు మీద వెళ్లే మనిషి అలా మాట్లాడి ఉంటే రెండు చేతులు.. రెండు కాళ్లు ఉండేవి కావని.. తీసేసే వాళ్లని ఆలీ అన్నాడు.
ఇదే మాటలు ఏ తమిళనాడులోనో.. కర్ణాటకలోనో మాట్లాడి ఉన్నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని.. ఇలాంటివి వినీ వినీ విసుగెత్తిపోయామని.. వాళ్ల పాపాన వారే పోతారన్న ఉద్దేశంతో ఇన్నాళ్లూ ఊరుకున్నామని.. ఐతే ఇకపై పరిస్థితి ఇలా ఉండదని ఆలీ అన్నాడు. ఇలాంటి సమయంలో దాసరి నారాయణరావు ఉన్నా పరిస్థితి మరోలా ఉండేదని ఆలీ అభిప్రాయపడ్డాడు.