బాలనటుడిగా కెరీర్ ను ప్రారంభించి...ఆ తర్వాత కమెడియన్ గా...హీరోగా....యాంకర్ గా ....ఇలా అలీ రకరకాల అవతారాల్లో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు. అలీ 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన `యమలీల` అలీ కెరీర్ లోనే బిగ్గెస్ట హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో అలీ సరసన ఇంద్రజ నటించింది. అయితే, వాస్తవానికి ఆ పాత్రలో దివంగత నటి - దివ్య భారతి నటించాల్సిందట. దివ్య భారతి హఠాన్మరణంతో ఆమెతో నటించే అవకాశం తనకు దక్కలేదని అలీ చెప్పారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తనకు, దివ్యభారతికి ఉన్న అనుబంధం గురించి అలీ వెల్లడించారు.
‘తొలిముద్దు’ సినిమాలో హీరో ప్రశాంత్ స్నేహితుడిగా తాను నటించానని, ఆ సెట్ లో దివ్యభారతితో పరిచయమైందని చెప్పారు. తనకు హిందీ రావడంతో ఆమెకి డైలాగులలో సాయం చేసేవాడినని, తన భుజంపై చేయివేసి చాలా సరదాగా మాట్లాడేదన్నారు. తాను ఆమెను దివ్య అని పిలిచేవాడినని, చాలా మంచి అమ్మాయని అన్నారు. ‘నువ్వు హీరో అయితే, నీ పక్కన నేను నటిస్తాన్రా!’ అని మాటిచ్చిందని గుర్తుచేసుకున్నారు. దివ్యభారతి బతికుండుంటే ‘యమలీల’లో ఆమే హీరోయిన్ గా నటించేదని, యమలీల మొదలవడానికి కొద్ది రోజుల ముందు ఆమె చనిపోయిందని చెప్పారు. దాంతో, ఆ సినిమాలో ఇంద్రజ హీరోయిన్ గా నటించిందన్నారు. ఇక, సినిమాల్లో గయ్యాళిగా కనిపించే సూర్యకాంతమ్మ మనసు చాలా సున్నితమైందని, సెట్‌లో తినడానికి ఏదో ఒకటి తెచ్చేవారని అలీ అన్నారు. షాట్ గ్యాప్ లో పేకాడుకుందామని పిలిచేవారని, తనకు ఆట నేర్పించారన్నారు. ఆటలో వంద రూపాయలు గెలుచుకున్నానని, అది చూసి......ఆట రాదన్నావ్ - దొంగసచ్చినోడా..అని అన్నారని గుర్తు చేసుకున్నారు.