ఫొటో స్టోరీ: ఈద్ ముబారక్ ఆలీ

Update: 2017-06-26 10:13 GMT
చాలాకాలంగా ఇండస్ట్రీలో ఉంటూ అందరితో  మంచిగా ఉండే నటుడు ఆలీ. చిన్న చిన్నపాత్రలు చేస్తూ ఒక దశలో హీరోగా వెలిగి తిరిగి హాస్య పాత్రలు చేసుకుంటూ కెరీర్ కంటిన్యూ చేస్తున్నాడు. ఆతరం నటుల నుంచి ఈతరం నటుల వరకు సన్నిహిత సంబంధాలు మెయిన్ టెయిన్ చేయడం తన స్పెషాలిటీ. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ లిస్టులో ఆలీ పేరు ముందే ఉంటుంది, నటనతో పాటు టీవీ షోలు, పబ్లిక్ మీటింగ్స్ లో యాంకరింగ్ చేయడం ఆలీ కున్న మరో స్పెషాలిటీ.

రంజాన్ పండగ సందర్భంగా కుటుంబంతో సంతోషంగా గడిపిన ఆలీ అందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తన భార్య - ఇద్దరు కూతుళ్లు - కొడుకులతో ఫ్యామిలీ ఫొటోకు ఫోజిచ్చాడు. పండగ రోజున ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కన్నా ఆనందం ఏముంటుంది. సాధారణంగా చాలామంది అనుకున్నట్లు ఆలీ ఎప్పుడు పడితే అప్పుడు నాన్ వెజ్ తినరని.. అలాగే రోజూ 5 సార్లు నమాజ్ చేస్తారని గతంలో ఆలీ భార్య చెప్పినా సంగతి తెలిసిందే. ఈద్ ముబారక్ ఆలీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News