క‌మెడియ‌న్స్.. సింగ‌ర్స్.. ఒక ఈవెంట్ సంపాద‌న‌?

Update: 2019-10-10 01:30 GMT
డిసెంబ‌ర్ 31 రాత్రి సెల‌బ్రేష‌న్స్ కి ఇప్ప‌టి నుంచే ఏర్పాట్లు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ముఖ్యంగా హైద‌రాబాద్ లో డీజే షోల‌తో పాటుగా.. ఔట్ స్క‌ర్ట్స్ లో సెల‌బ్రిటీ షోల‌కు ప్లాన్స్ ప‌క‌డ్భందీగా అమ‌ల‌వుతున్నాయి. ఓవైపు స్టార్ల‌తో డ్యాన్సింగ్ షోలు.. స్కిట్ లు.. మ‌రో వైపు హోస్టింగ్ జోరు.. గాయ‌నీగాయ‌కుల పాట‌ల‌తో హోరు.. ఇంత హంగామా ఉండాలంటే ఒక్కో ఈవెంట్ కి ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేస్తుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ షోల‌కు ఉన్న ఆద‌ర‌ణ వ‌ల్ల ఆర్జ‌న కూడా అదే రేంజులో ఉంద‌ని తాజాగా తుపాకికి ఎక్స్ క్లూజివ్ గా అందిన వివ‌రాలు వెల్ల‌డిస్తున్నాయి. ఈ షోల్లో పాల్గొనే ఒక్కో ఆర్టిస్టు లేదా క‌మెడియ‌న్ భారీగానే ఆర్జిస్తున్నారు. అందాల క‌థానాయిక‌లు డ్యాన్సింగ్ షోల‌కు పుచ్చుకున్న‌ట్టే క‌మెడియ‌న్ల‌కు.. గాయ‌నీగాయ‌కుల‌కు భారీగానే ముడుతోంది.

ఒక నైట్ ఈవెంట్ కి కమెడియన్స్ ఆర్జ‌న ఇలా ఉంది.

ధన్ రాజ్ - తగుబోతు రమేష్ - నల్లా వేణు- 5-7 లక్షలు (ఒక్కొక్క‌రికి)
రచ్చ‌ రవి -2 లక్షలు
సప్తగిరి -7 లక్షలు
సత్యం రాజేష్ -5 లక్షలు
జబర్దస్త్ రాకేశ్ జట్టు -2 -2.5 లక్షలు
రాకెట్ రాఘవ జట్టు -3-4 లక్షలు
సుడిగలి సుధీర్ జట్టు- 6-7 లక్షలు
చమ్మక్ చంద్ర జట్టు -6-7 లక్షలు
హైపర్ అది టీమ్ -5-6 లక్షలు
బుల్లెట్ భాస్కర్ & సుధాకర్ జట్టు -4-5 లక్షలు
సాధారణ కొత్త రాబోయే జట్టు -1.5-2 లక్షలు
బిత్రి సతి -3-4 లక్షలు
పటాస్ కామెడీ బృందం - 2- 3 లక్షలు

ఒక ఈవెంట్ కి గాయకుల ఆదాయం ఇలా ఉంది:

భార్గవి పిళ్లై- 2-3 లక్షలు
గీతా మాధురి- 7 లక్షలు
హనుమాన్-2-3 లక్షలు
హేమ చంద్ర -5-7 లక్షలు
శ్రీరామ్ చంద్ర -15-20 లక్షలు
రేవంత్ –12-15 లక్షలు
రోహిత్ 6-8 లక్షలు
దిన‌క‌ర్ -3 లక్షలు
రాహుల్ - 7- 8 లక్షలు
దామిని - 2 -3 లక్షలు
శ్రావణ భార్గ‌వి -3-4 లక్షలు
మాళ‌విక‌ -1.5-2 లక్షలు
మను- 7 నుండి 8 లక్షలు
పృథ్వీ చంద్ర- 2 లక్షలు
సింహా -4 -5 లక్షలు
సునీత -7-8 లక్షలు
రఘు కుంచె- 7 లక్షలు
బాబా షెగల్ -7 లక్షలు
లక్ష్మీ గాయత్రి & శ్రుతి - 2.5 -3 లక్షలు
మనీషా -5 లక్షలు
ఉమా నేహా -4 లక్షలు
కీర్తన శర్మ -3 లక్షలు
రోల్ రిడా -3 లక్షలు


Tags:    

Similar News