తెరమీద వాళ్లను చూడగానే మన ముఖాల్లో నవ్వు పులుముకుంటుంది. మనల్ని అంతగా నవ్వించిన వాళ్లకు నిజజీవితంలో మాత్రం కన్నీళ్లే మిగిలాయి. మన తెలుగులో ఇద్దరు గ్రేట్ కమెడియన్ల జీవితాల్లో జరిగిన విషాదమే ఇప్పుడు తమిళ స్టార్ కమెడియన్ వివేక్ జీవితంలోనూ చోటు చేసుకుంది. 90ల్లో అద్భుతమైన కామెడీ జోడీగా పేరు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావు - బాబూ మోహన్ ఇద్దరూ కొడుకుల్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.
బాబూమోహన్ తనయుడు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం అప్పట్లో తెలుగు వాళ్లందరిలో విషాదం నింపింది. కొడుకు చనిపోయిన ఇన్నేళ్లకు కూడా ఎప్పుడైనా ఆ ప్రస్తావన తెస్తే బోరుమంటారు బాబూ మోహన్. కొన్నేళ్ల కిందట కోటకూ ఇదే అనుభవం ఎదురైంది. ఫాదర్స్ డే రోజు ఆయన కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ సమయంలోనూ తెలుగు వారి కళ్లు చెమర్చాయి.
ఇప్పుడు తమిళ కమెడియన్ వివేక్ కూడా పుత్రశోకంతో కన్నీరు మున్నీరవుతున్నాడు. వివేక్ తనయుడు ప్రసన్న రెండు రోజుల కిందట అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. వివేక్ కు కమెడియన్ గానే కాదు, మంచి వ్యక్తిగా కూడా తమిళనాట చాలా మంచి పేరుంది. బయట చాలా వినమ్రంగా నడుచుకుంటాడతను. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడు. ఇన్నేళ్ల కెరీర్ లో ఒక్క చిన్న వివాదం కూడా లేదు. అలాంటి వాడు ఎదిగిన కొడుకును కోల్పోవడం తమిళ జనాలు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ప్రసన్నకు పెద్ద అనారోగ్యం కూడా లేదు. రెండు నెలల కిందటి వరకు అతను బాగానే ఉన్నాడు. ఈ మధ్య డెంగ్యూ ఫీవర్ వచ్చింది. అది తీవ్రమై... బ్రెయిన్ ఫీవర్ గా మారింది. చాలా పెద్ద హాస్పిటల్లో వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. పిల్లవాడు ప్రాణాలు వదిలాడు. పుత్రశోకం కంటే బాధ మరొకటి ఉండదు. అందర్నీ నవ్వించే వివేక్ జీవితంలో ఇంతటి విషాదం నెలకొనడం విచారకర విషయం.