ఒక టైంలో అదే పనిగా మాస్ మసాలా సినిమాలు చేశాడు రామ్ చరణ్. ఐతే అతనా సినిమాలు చేస్తున్న టైంలోనే ట్రెండు మారింది. అతనూ మారక తప్పలేదు. రొటీన్ సినిమాలకు సెలవిచ్చేసి.. ‘ధృవ’ లాంటి వైవిధ్యమైన సినిమా చేశాడు. దానికి మంచి ఫలితమే వచ్చింది. దీని తర్వాత సుకుమార్ లాంటి క్లాస్ దర్శకుడితో సినిమా మొదలుపెట్టాడు. సుక్కు సినిమాలు ఎలా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మాస్ ప్రేక్షకులకు అవి అంతగా రుచించవు. పైగా ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటి వాడిగా.. చాలా సామాన్యుడిగా కనిపిస్తాడని అంటున్నారు. అదెంత వరకూ నిజమో కానీ.. చరణ్ మాస్ ఫ్యాన్స్ లో ఈ సినిమా విషయమై కొంత ఆందోళన ఉంది.
ఐతే సుక్కు సినిమా తర్వాత కూడా చరణ్ ఇలాగే క్లాస్ టచ్ ఉన్న సినిమా చేస్తే.. అతడి మాస్ ఫ్యాన్స్ మరింత ఫీలయ్యే అవకాశముంది. మాస్ లో చరణ్ కు పట్టు తగ్గే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈసారి రూటు మార్చాలని భావిస్తున్నాడు చరణ్. దిల్ రాజు నిర్మాణంలో తన తర్వాతి సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చిన చరణ్.. తన కోసం పక్కా మాస్ మసాలా స్క్రిప్టు రెడీ చేయాలని చెప్పాడట. ముందు రాజు తన స్టయిల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాన్ చేసినప్పటికీ.. ఇప్పుడు చరణ్ కోరిక మేరకు తన టీంతో మాస్ కథ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడట. ఈ చిత్రానికి దర్శకుడెవరన్నది ఇంకా ఖరారవ్వలేదు. రాజు దగ్గర దర్శకులకు కొదవేమీ ఉండదు. ఎవరు కథతో మెప్పిస్తే వాళ్లకే ఛాన్స్ దొరుకుతుంది. కథ ఓకే అయ్యాక ఈ సినిమా గురించి ప్రకటన రానుంది. మాస్ కథే చేయాలని చరణ్ ఫిక్సయిన నేపథ్యంలో అతడి ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పని లేదు.