రెండు సినిమాలకే రాజమౌళితో పోలిక..?

Update: 2022-11-23 05:30 GMT
టాలీవుడ్ లో యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ అద్భుతాలు చేస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్ తోనే తన టాలెంట్ చూపించి నానిని ఒప్పించి అ! సినిమా తీసిన ప్రశాంత్ వర్మ ఆ మూవీతోనే తన ప్రతిభ చాటారు. ఇక సెకండ్ మూవీ కల్కి కూడా ఇంప్రెస్ చేసింది. ఆ తర్వాత వచ్చిన జాంబీ రెడ్డి కమర్షియల్ హిట్ అయ్యింది. ఫస్ట్ తెలుగు జాంబి మూవీగా ప్రశాంత్ వర్మ కి మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇక ఆ క్రేజ్ తోనే ప్రశాంత్ వర్మ ఈసారి ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్ అంటూ ఓ అదిరిపోయే మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా హనుమాన్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూశాక మరోసారి ప్రశాంత్ వర్మ ప్రతిభ గురించి చర్చించుకునేలా చేశాడు.

ఇక ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో ఆ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసిన గెటప్ శ్రీను మాట్లాడుతూ ఇండస్ట్రీలో మరో రాజమౌళి అంటూ ప్రశాంత్ వర్మని పొగిడాడు. రాజమౌళి తో పోల్చడమే కొందరిని హర్ట్ చేసింది.

తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లి హాలీవుడ్ మేకర్స్ కూడా తెలుగు సినిమా గురించి తన డైరక్షన్ గురించి మాట్లాడుకునేలా చేసిన రాజమౌళితో కేవలం రెండు సినిమాలు తీసిన ప్రశాంత్ వర్మని పోల్చడం ఏంటని జక్కన్న ఫ్యాన్స్.. తెలుగు సినీ లవర్స్ అంటున్నారు. రాజమౌళి స్పూర్తితో తను ఈ మూవీస్ చేస్తున్నాడు అంటే ఓకే కానీ అలా కాకుండా ప్రశాంత్ వర్మ మరో రాజమౌళి అనడం మాత్రం కరెక్ట్ కాదు.

స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆర్.ఆర్.ఆర్ వరకు తన ప్రతి సినిమాతో కమర్షియల్ హిట్ అందుకుంటూ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు రాజమౌళి. అలాంటి రాజమౌళితో పోల్చాలంటే గట్స్ ఉండాలి. ప్రశాంత్ వర్మని గెటప్ శ్రీను రాజమౌళి తో పోల్చడం పై విమర్శలు వస్తున్నాయి. తెలుగులో ప్రతిభ గల దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒ కరని కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే కానీ అలా కాకుండా రాజమౌళి  తో పోల్చుతూ అతనిపై కామెంట్ చేయడం కరెక్ట్ కాదని ఆడియన్స్ రియాక్షన్.

అంతేకాదు గెటప్ శ్రీను తనని రాజమౌళితో పోల్చుతున్నా డైరెక్ట్ ఎలాంటి రెస్పాన్స్ లేకుండా అవును అన్నట్టు సైలెంట్ గా ఉండటం కూడా కొందరిని నొప్పిస్తుంది. కుర్రాడు డైరెక్టర్ గా ఎంత తోపు అయినా కొన్ని విషయాల్లో కచ్చితంగా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అది తెలియకపోతే మాత్రం ఎంత టాలెంట్ ఉన్నా సరే పరిగణలోకి తీసుకోరు. 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News