బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ చిక్కుల్లో పడ్డారు. ఆమెపై ముంబై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇప్పుడీ వార్త బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. కరీనా కపూర్ పై పోలీసులు ఎందుకు కేసు పెట్టారు? ఎవరు ఫిర్యాదు చేశారని అందరూ ఆరాతీస్తున్నారు.
అసలు ఈ వివాదానికి కారణంగా ఇటీవల కరీనా కపూర్ తన ప్రెగ్నన్సీ గురించి రాసిన పుస్తకమేనట.. ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రగ్నెన్సీ బైబిల్’ అనే పేరుతో ఈ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ బుక్ తనకు బిడ్డతో సమానమని చెప్పింది. అలాంటిది ఇప్పుడు ఆ పుస్తకం కారణంగానే ఆమె చిక్కుల్లో పడింది.
ఈ బుక్ పేరులో ‘బైబిల్’ అని పెట్టడంపై క్రిష్టయన్లు భగ్గుమన్నారు. ఈ బుక్ క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ కరీనా కపూర్ పై శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రకు చెందిన పలు క్రిస్టియన్ సంఘాలు కరీనాపై మండిపడుతున్నాయి.
ఆల్ఫా, ఒమెగా క్రిస్టియన్ మమాసంగ్ అధ్యక్షుడు ఆశిష్ షిండే కరీనాపై ఫిర్యాదు చేసినట్లు బీడ్ లోని శివాజీనగర్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి శ్రీనాథ్ తంభోర్ మీడియాకు తెలిపారు. కరీనాతోపాటు ఈ బుక్ రాసిన మరో రచయిత అదితి షా బీమ్జనిపై కూడా కేసు నమోదైనట్లు తెలిపారు. ఈ బుక్ టైటిల్ పవిత్రగ్రంథమైన బైబిల్ ను అవమానించేలా ఉందని ఆశిష్ షిండే తన ఫిర్యాదులో పేర్కొంది.
అయితే ఈ కేసు విషయంలో పోలీసులు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు. ఫిర్యాదు అందింది తప్ప ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలుస్తోంది. ఈ కేసును ముంబై పరిధిలో నమోదు చేయాల్సిందిగా అధికారులు సలహా ఇచ్చినట్టు తెలిసింది.
ఇక ఈ వివాదం, కేసుపై ఇప్పటిదాకా అధికారికంగా నటి కరీనాకపూర్ స్పందించలేదు.