'జబర్దస్త్' షో కమెడియన్ హైపర్ ఆదిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీలో ప్రసారమైన ఓ కార్యక్రమంలో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను కించపరిచే విధంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎల్బీనగర్ ఏసీబీ శ్రీధర్ రెడ్డికి కంప్లైంట్ అందించారు.
హైపర్ ఆదితోపాటు, స్క్రిప్టు రైటర్, మల్లెమాల ప్రొడక్షన్ ను ప్రతివాదులుగా చేర్చారు. తమ సంస్కృతిని అవమానించి, మనోభావాలు దెబ్బతీసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కంప్లైంట్ ఇచ్చిన వారిలో.. తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి ఇజల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్, సమాచారహక్కు సాధన స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యర్శి కార్తీ, టీఎస్ యూ రాష్ట్ర కార్యదర్శి చింత మహేష్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ తదితరులు ఉన్నారు.
కాగా.. గతంలోనూ హైపర్ ఆదిపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదులు అందాయి. తమను అవమానించేలా స్కిట్లు చేశారని పలువురు అనాథ బాలలతోపాటు సినీ సమీక్షకుడు కత్తి మహేష్ కూడా ఫిర్యాదు చేశారు.