కొన్ని కథల్ని మినిమమ్ బడ్జెట్ లో చేయెచ్చు.. భారీ బడ్జెట్ లో చేయెచ్చు. అలాంటి కథలు ప్రేక్షకుల్ని ఎప్పుడూ ఎంటర్ టైన్ చేస్తూ సరికొత్త అనుభూతికి లోను చేస్తుంటాయి. అదే పాయింట్ తో మినిమమ్ బడ్జెట్ తో తెరపైకొచ్చినా .. భారీ బడ్జెట్ తో రూపొందించినా సక్సెస్ గ్యారెంటీ అనే విషయాన్ని 'ఆదిత్య 369', రీసెంట్ గా విడుదలైన 'ఒకే ఒక జీవితం' సినిమాలు నిరూపించాయి. నందమూరి బాలకృష్ణ కొన్నేళ్ల క్రితం నటించిన టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ 'ఆదిత్య 369'.
సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. మళ్లీ ఇన్నేళ్లకు ఇదే తరహాలో కొత్త కథతో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన సినిమా 'ఒకే ఒక జీవితం'. ప్రామిసింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన ఈ మూవీని తమిళ, తెలుగు భాషల్లో కొత్త దర్శకుడు శ్రీకార్తీక్ రూపొందించారు. అమల అక్కినేని కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి హీరో శర్వాకు స్నేహితులుగా నటించారు.
మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో టైమ్ ట్రావెల్ మూవీగా రూపొందిన ఈ సినిమా రీసెంట్ గా విడుదలై ప్రేక్షకుల్ని రెండు భాషల్లోనూ విశేషంగా ఆకట్టుకుంటోంది. చిన్నతనంలో మరణించిన తన తల్లిని రాపాడుకోవాలనే ఆలోచనతో సైంటిస్ట్ పాల్ చెప్పిన టైమ్ మెషీన్ ని నమ్మి లైఫ్ రిస్క్ అని తెలిసి కూడా ఆది అనే యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి టైమ్ మెషీన్ లో రెండు దశాబ్దాలు వెనక్కి వెళతారు. ఆ తరువాత ఏం జరిగింది? .. వీరి కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనే ఆసక్తికరమైన కథ, కథనాలతో ఈ మూవీని దర్శకుడు భారీ హంగులు, ఆర్భాటాలు లేకుండా తెరకెక్కించాడు.
రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి హిట్ గా నిలిచింది. తక్కవు బడ్జెట్ తో చేసిన టైమ్ ట్రావెల్ ప్రయోగం సక్సెస్ అయింది. అయితే ఇదే తరహా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ లో రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఓ స్టార్ హీరో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
వందల ఏళ్లు భవిష్యత్తులోకి వెళ్లే ఈ ప్రాజెక్ట్ పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఎప్పుడు ఎలా తీసినా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ సక్సెస్ ఫుల్ కాన్సెప్ట్ గా నిలవడంతో భారీ స్థాయిలో వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాన్సెప్ట్ ఒకటే.. కానీ బడ్జెట్ లే వేరు.. భారీ కాస్టింగ్ వేరు కావడంతో స్టార్ హీరో తో తెరకెక్కుతున్న టైమ్ ట్రావెల్ మూవీ ఏ స్థాయిలో వేండబోతోందా? అని అంతా ఆరాతీస్తున్నారు. కాన్సెప్ట్ ఒకటే అయినా నేపథ్యం.. భారీతనం సరికొత్త అనుభూతిని కలిగించే విజువల్స్ తో స్టార్ హీరో మూవీ తెరపైకి రాబోతోంది. దీంతో చాలా మంది సినీ లవర్స్ హాలీవుడ్ సినిమాని చూడబోతున్నామనే అనుభూతిని వ్యక్తం చేస్తున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.