కీచులాడుకుంటున్న టాలీవుడ్ స్టార్ కపుల్?

Update: 2019-08-14 17:30 GMT
భార్యాభార్తలన్న తర్వాత గొడవలు చాలా కామన్. శృతి మించనంత వరకూ గొడవలు ఉన్నా కూడా పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. అయితే లిమిట్ దాటితేనే వస్తుంది చిక్కు.  సాధారణమైన జంట అయినా సెలబ్రిటీ జంట అయినా ఎవరూ ఈ గొడవలకు అతీతం కాదు.  ఎవరైనా ఒక జంట అసలేం గొడవలు లేవు అన్నట్టుగా కనిపిస్తున్నారంటే.. అందుకు రెండు కారణాలు ఉంటాయి. ఒకటి పూర్తిగా కవర్ చేస్తూ బయటకు ఆస్కార్ లెవెల్ నటన కనబరుస్తున్నారు అని అర్థం.  రెండో కారణం.. జుట్టూ జూట్టూ పట్టుకొని బండబూతులు తిట్టుకుంటూ కొట్టుకొని అలసి సొలసి మౌనాన్ని ఆశ్రయించి ఉంటారు! ఈ రెండు కారణాలు కాకుండా కూడా గొడవలు లేవంటే ఇద్దరిలో ఒకరు 'అయితే ఓకే' బాపతు!

అయినా బుధవారం నాడు ఈ భార్యా భర్తల మధ్య గొడవల గోల మనకెందుకు అంటే..మన టాపిక్ అదే కాబట్టి.  టాలీవుడ్ లో ఒక పెద్ద స్టార్ హీరో.. పె..ద్ద బ్యాక్ గ్రౌండ్. ఆయన కొన్నేళ్ళ క్రితం లవ్ మ్యారేజ్ చేస్తుకున్నాడు. అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు కానీ బిజినెస్ ఫ్యామిలీ.  మొదట్లో ఇద్దరి మధ్య అంతా బాగానే ఉందట కానీ ఈమధ్య విభేదాలు మొదలయ్యాయట. ఏదో ఒక విషయంపై చీటికిమాటికి గొడవ పడుతున్నారట. ఈ విషయం ఇప్పటికే టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది.  కానీ పైకి మాత్రం అంతా సవ్యంగానే ఉన్నట్టు అనిపించేలా ప్రవర్తిస్తున్నారట
Read more!

మరి ఇలానే కొనసాగితే ఈ స్టార్ హీరో ఫ్యామిలీ విభేదాలు ఏదో ఒక రోజు మీడియా కెమెరాల కంటికి చిక్కడం కూడా ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మరి అంత దూరం తీసుకెళ్తారో లేదా ఆలోపే సర్దుకొని "ఒకరికోసం ఒకరు పుట్టారు.. మేడ్ ఫర్ ఈచ్ అదర్" అన్నట్టుగా కవరింగ్ ఇస్తారో వేచి చూడాలి.  అయినా మన పిచ్చి కానీ ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా దగ్గొస్తే దగ్గాల్సిందే.. తుమ్మొస్తే తుమ్మాల్సిందే.. కోపం వస్తే గొడవ పెట్టుకోవాల్సిందే. ఎక్కువకాలం ఎమోషన్స్ దాచిపెట్టడం కుదరదు కదా!


Tags:    

Similar News